సాగునీటి పథకాలకు మొండిచేయి | - | Sakshi
Sakshi News home page

సాగునీటి పథకాలకు మొండిచేయి

Mar 7 2026 7:29 AM | Updated on Mar 7 2026 7:29 AM

సాగునీటి పథకాలకు మొండిచేయి సాగునీటి వనరులకు ఇబ్బందులు సాగునీటి పథకాలకు చెక్‌ పెట్టేశారు..

నూతన చెక్‌డ్యాంలు, చెరువుల

నిర్మాణాలు నిల్‌

పోయినవాటికి మరమ్మతుల్లేవు..

రబీ ఎలాగు లేదు.. ఖరీఫ్‌ కూడా కష్టమే..

గిరిజన ప్రాంతాల్లో గెడ్డలే ఆధారం

నిర్వీర్యమైన చిన్నతరహా నీటి వనరుల శాఖ

సీతంపేట ఏజెన్సీలో మర్రిపాడు పంచాయతీ పరిధిలో ఎనిమిది చెక్‌డ్యాంలు పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయి. చుక్కనీరు కూడా నిల్వ ఉండదు. వీటి పరిధిలో దాదాపు 300ల ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. చెక్‌డ్యాలు పూర్తిగా పాడవ్వడంతో సాగు నీరు నిల్వలేక వర్షాధారంపై ఆధారపడి పండించాల్సి వస్తుంది. వర్షాలు సకాలంలో పడితే పరవాలేదు.. లేకపోతే పంటలు పోతాయని, పెట్టిన మదుపులు కూడా పోతాయని కొందరు గిరిజన రైతులు సాగు కూడా చేయడం లేదు. పూతికవలస, శంబాం, కుశిమి ఇలా చెప్పుకుంటూ పోతే ఐటీడీఏ పరిధిలో సబ్‌ప్లాన్‌ మండలాల దుస్థితి ఇలా తయారైంది. ఇటు ఖరీఫ్‌, అటు రబీ పంటలు లేక, కొండపోడు పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు అవస్థలు పడుతున్నారు.

సాగునీటి వనరులకు ఇబ్బందులు తప్పడం లేదు. గెడ్డలపై ఆధారపడు తున్నాం. మా ప్రాంతంలో పూర్తిగా సాగునీటి వనరు లు లేవు. గతంలో పలుమార్లు ఐటీడీఏలో విన తులు కూడా ఇచ్చాం. కొత్త నిర్మాణాలు లేవు. మరమ్మతులు కూడా చేపట్టడం లేదు.

– వి.చలపతిరావు, మర్రిపాడు

సాగునీటి పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం చెక్‌ పెట్టేసింది. గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా సాగునీటి వనరులు లేవు. దీంతో వివి ధ రకాల పంటల సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. చెక్‌డ్యాంలు, చెరువులు, కాలువలకు నిధులు మంజూరు చేసి వెంటనే నిర్మాణాలు చేపట్టాలి.

– విశ్వాసరాయి కళావతి,

మాజీ ఎమ్మెల్యే, పాలకొండ

సీతంపేట:

టీడీఏ పరిధిలో సమగ్ర గిరిజనాభ్యుదయ సంస్థ పరిధిలో సాగునీటి కష్టాలు గిరిజనులకు తప్పడం లేదు. నూతన చెక్‌డ్యాలు, చెరువులు వంటి నిర్మాణాలు లేవు. గిరిజన రైతులకు రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. గతంలో ఇక్కడ పని చేసిన చిన్ననీటి వనరుల విభాగం నిర్వీర్యమైంది. ఈ విభాగాన్ని శ్రీకాకుళం క్వాలిటీ కంట్రోల్‌ కింద మూడేళ్ల కిందట మార్చారు. కేవలం డీఈ కార్యాలయాన్ని మాత్రమే ఇక్కడ ఉంచారు. దాని పరిధిలో సాగునీటి వనరులు కల్పించాల్సి ఉంది. ఈ శాఖను ఇక్కడ ఉంచినప్పటికీ సిబ్బంది మాత్రం ఎవ్వరూ లేరు. ముఖ్యంగా ఎస్‌ఎంఐ శాఖ ద్వారా గిరిజన ప్రాంతాల్లో అవసరమైన చోట సాగునీటి వనరులు కల్పించాలి. వర్షాలు పడేటప్పుటు నీటిని నిల్వ ఉండేటట్టు చూడడం, అవసరమైనపుడు చెక్‌డ్యాం, చెరువులు వంటి వాటి ద్వారా నీటిని పంటల సాగుకు వాడేలా చూడాలి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి గిరిజన ఉప ప్రణాళికా విభాగం ద్వారా 20 మండలాల్లో చిన్ననీటి పారుదల పథకాలైన చెరువులు, చెక్‌ డ్యాంలు, చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. పిల్ల కాలు వలను అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా టీపీఎంయూ మండలాలైన సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి, మంద స మండలాల పరిధిలో పనులు అధికంగా జరగా ల్సి ఉంది. కానీ ఈ శాఖకు నిధుల లేమి కారణంగా పనులు చేపట్టలేని పరిస్థితి ఉందని సంబంధిత శాఖ అధికారులే చెబుతున్నారు. కొన్నాళ్లుగా చెక్‌ డ్యాం, చెరువుల నిర్మాణాలు, మరమ్మతులు లేవు. కేవలం గెడ్డల్లో ఉన్న నీటి నిల్వల మీద ఆధారపడి సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తప్పని కష్టాలు

ఏజెన్సీలో ఖరీఫ్‌ సీజన్‌తో పాటు రబీ పంటల సాగు కష్టంగా మారింది. ఐటీడీఏ పరిధిలో 20 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు పండుతాయి. జూన్‌ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్‌లో 12 వేల హె క్టార్ల వరకు వరి, కంది, రాగుల పంటలు వేస్తారు. గెడ్డలు ఆనుకుని ఉన్న గతంలో నిర్మించిన చెక్‌డ్యాంలు, చెరువులలో నీరు లేదు. అసలు నీరు నిల్వలు ఉండాలనే ఉద్దేశంతో చెక్‌డ్యాంలు, చెరువులు, కాలువలు నిర్మించారు. గతంలో కురిసిన అడపాద డపా వర్షాలకు చుక్కనీరు లేని దుస్థితి ఉంది. వీటి మరమ్మతులు కూడా చేసిన దాఖలాలు లేవు. దీంతో ఖరీఫ్‌, రబీ సాగు ఎండమావిగా మారింది. ఉద్యానవనాల పంటలకు నష్టాలు తప్పడం లేదు. సుమారు 40 వేల ఎకరాల వరకు ఉద్యానవనాల పంటలైన జీడి, మామిడి, పనస వంటి పంటలను గిరిజనులు పండిస్తున్నారు. ఐటీడీఏ కూడా కొన్ని వేల ఎకరాల ఉద్యానవన పంటలను ప్రోత్సాహించినప్పటకీ వాటికి అవసరమైన నీరు అందివ్వలేని పరిస్థితి.

శంభాం పరిధిలో ముక్కలైన

మద్దిమానుగూడ చెక్‌డ్యాం

జిల్లేపాడు పరిధిలో అభివృద్ధికి నోచుకోని

బుద్దిమాను చెరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement