సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య ఆహారం | - | Sakshi
Sakshi News home page

సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య ఆహారం

Mar 1 2026 7:37 AM | Updated on Mar 1 2026 7:37 AM

సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య ఆహారం

సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య ఆహారం

సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య ఆహారం

పార్వతీపురం రూరల్‌ : గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత కల్పించేందుకు ఫుడ్‌ బాస్కెట్‌ (ఆహార బుట్ట) విధానం ఎంతగానో దోహదపడుతుందని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎస్‌.సుధారాణి తెలిపారు. జిల్లా సమాఖ్య కార్యాలయంలో వీఓ ఉప కమిటీలు, ఆరోగ్య పోషణ ఐసీఆర్‌పీలకు శనివారం నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై సిబ్బంది ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించవచ్చని ఆర్‌వైఎస్‌ఎస్‌ డీపీఎం ఎం.శ్రావణకుమార్‌ నాయుడు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఏడాది పొడవునా పోషక వనాలు (న్యూట్రీ గార్డెన్‌) పెంచేలా రైతులకు సహకరించాలన్నారు. ఆర్‌టీఓ హేమసుందర్‌ మాట్లాడుతూ ఫుడ్‌ బాస్కెట్‌ ప్రయోజనాలను వివరించారు. సెర్ప్‌, ఆర్‌వైఎస్‌ఎస్‌ సిబ్బంది సమన్వయంతో సేవలందించాలని డీపీఎం జయశ్రీ కోరారు. ప్రకృతి వ్యవసాయంలో మహిళల పాత్ర, బయో ఇన్‌పుట్‌ కేంద్రాల ప్రాముఖ్యతపై ఏడీపీఎం పి.ప్రవీణ్‌కుమార్‌, ఉత్పత్తుల మార్కెటింగ్‌పై తిరుపతి, శిక్షణ అంశాలపై శోభ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల ఏపీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement