పార్వతీపురం రూరల్: తమ న్యాయమైన సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ మాతృభాష వలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో సోమ వారం ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించా రు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లిన వలంటీర్లు, అనంతరం కార్యాలయ ముఖద్వారం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.మురళీమోహనరావు మాట్లాడుతూ.. 2004 నుంచి సవర భాషా వలంటీర్లు మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో మాతృభాషలో బోధన చేస్తున్నారని తెలిపారు. వీరి కృషివల్ల గిరిజన విద్యార్థుల హాజరుశాతం పెరిగి, డ్రాపౌట్ల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరికి నెలకు కేవలం రూ.5 వేల వేతనం మాత్రమే అందుతోందని, విధులకు తగినట్లుగా కనీస వేతనం చెల్లించాలని కోరారు. గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గిరిజన విద్యకు కేటాయించే బడ్జెట్‌తో వలంటీర్ల వేతనాలు పెంచే అవకా శం ఉన్నా, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. వచ్చే జూన్ నాటికి వేతనాలు పెంచని పక్షంలో ‘చలో సెక్రటేరియట్’ నిర్వహిస్తామని హెచ్చరించా రు. గిరిజన సంఘం నాయకులు రామస్వామి మా ట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో కులీభాషా (జాతాపు) వలంటీర్లను నియమించినట్టు గానే, ఇక్కడ కూడా వెంటనే నియామక ప్రక్రియ చేపట్టాలని కోరారు. అనంతరం ఐటీడీఏ ఏపీఓ, డీడీలు నిరసనకారుల వద్దకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. వలంటీ ర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వలంటీర్ల సంఘం నాయకులు బి. వెంకటేష్, డలబు, సుక్కు, భీమారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


