ఎల్.కోటలో అగ్ని ప్రమాదం
● 60 ధాన్యం బస్తాలు,
రెండు గడ్డి వాములు దగ్ధం
● సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం
లక్కవరపుకోట: మండల కేంద్రంలోని అరకు – విశాఖ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కళ్లాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన జామి అప్పలనారాయణకు చెందిన గడ్డివాము, సుమారు 60 బస్తాల ధాన్యం కాలిపోగా ,బూర్లు సూరిబాబుకు చెందిన గడ్డివాము కాలి బూడిదయ్యాయి. గడ్డివాము దగ్గర ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో గుర్తించిన రైతులు అప్రమత్తమై ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే వారు వచ్చి మంటలను అదుపు చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు వీఆర్‌ఓ గణేష్ అంచనా వేశారు.
నీలగిరి తోట దగ్ధం..
గజపతినగరం రూరల్: మండలంలోని గుడివాడ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నడిమంటి గాంధీకి చెందిన నీలగిరి తోట దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 15 వేల రూపాయల ఆస్తినష్టం జరిగి నట్లు అగ్నిమాపక అధికారి ప్రసాద్ తెలిపారు. ఎవ రో సిగరెట్/బీడీ తాగి పడేయడం వల్ల ఈ ప్రమా దం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్.కోటలో అగ్ని ప్రమాదం


