దేశాభివృద్ధిలో యువతే కీలకం | - | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో యువతే కీలకం

Mar 3 2026 7:32 AM | Updated on Mar 3 2026 7:32 AM

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం రూరల్‌: దేశానికి యువ జనాభా గొప్ప ఆస్తి అని, దేశాభివృద్ధిలో యువతదే కీలకపాత్ర అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. స్థానిక జేఎన్‌టీయూ జీవీ ప్రాంగణంలో జేఎన్‌టీయూ జీవీ, మేరా యువభారత్‌ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వికసిత్‌ భారత్‌ యువజన పార్లమెంట్‌– 2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత తమ జ్ఞానాన్ని, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి వినియోగించాలన్నారు. యువజన పార్లమెంట్‌ కార్యక్రమాలు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంట్‌ విధానాలపై అవగాహన పెంచుతాయని అభిప్రాయపడ్డారు. నేటి యువతే, రేపటి దేశ నాయకులని.. ప్రతిఒక్కరూ నాయకత్వ లక్షణాలతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఉపకులపతి వీవీ సుబ్బారావు మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా ఇతర రంగాల్లో రాణించి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని కోరారు. అనంతరం జిల్లాలోని వివిధ యువ క్లబ్‌ల ప్రతినిధులకు ఎంపీ కలిశెట్టి చేతులమీదుగా క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేరా యువభారత్‌ జిల్లా యువజన అధికారి ఎన్‌పీ భారత్‌కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement