ప్రభుత్వ భూమిని సైతం.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమిని సైతం..

Feb 27 2026 7:45 AM | Updated on Feb 27 2026 7:45 AM

ప్రభుత్వ భూమిని  సైతం..

ప్రభుత్వ భూమిని సైతం..

భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూలో సర్వే నంబర్‌ 21, 27లో ఉన్న సుమారు 6 ఎకరాలు పక్కా ప్రభుత్వ భూమి. అందుకే క్రయ విక్రయాల జరగకుండా నిషేధిత భూముల జాబితాలో గత రెవెన్యూ అధికారులు చేర్చారు. చాలామంది పెద్దలు అధికారులకు కోట్లాది రూపాయలు ఎరచూపినా ఎవరూ ఆ భూములను 22–ఎ జాబితా నుంచి తొలిగించలేదు. తాజాగా 22–ఎ భూముల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఒక జీఓ ప్రకారం టీడీపీ నేతకు కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఆ ప్రకారం కొన్ని అడ్డంకులు ఉన్నా అవేవి చూడకుండా

నిషేధిత భూముల జాబితా నుంచి తొలిగించేందుకు అవసరమైన

ఫైల్‌ సిద్ధం చేసేశారు.

బ్యానర్‌...

ప్రతి ఫైల్‌కు ఒక రేటు...

అదే ఆ సెక్షన్‌ రూటు

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

పొరపాటునో.. గ్రహపాటులో ఏవైనా భూములు వివాదాస్పద భూముల జాబితాలో చేరితే వాటిని రెవెన్యూ అధికారులు సరి చేస్తారు. అసలు హక్కుదారులకు భూమిని.. యాజమాన్య హక్కు పత్రాలను అందిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. వివాదాలు పరిష్కరించుకోండి అంటూ ప్రభుత్వం ఇచ్చిన ఒక సర్క్యులర్‌ను ఆధారం చేసుకుని విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారులు చెలరేగిపోతున్నారు. ఆ సర్క్యులర్‌ను అడ్డం పెట్టుకుని తమకు నచ్చిన వారి ఫైళ్లు... దశాబ్దాలుగా పరిష్కారంకాని ఫైళ్లను వెతికి మరీ సెటిల్‌ చేసేస్తున్నారట. దానికి ప్రతిగా రూ.లక్షల్లో... ఇంకా పెద్ద ఫైల్‌ అయితే రూ.కోట్లలో బేరాలు కుదుర్చుకుని క్లియర్‌ చేస్తున్నట్టు సమాచారం. గతంలో తలపండిన రెవెన్యూ అధికారులు సైతం టచ్‌ చేయడానికి భయపడిన వివాదాస్పద భూములకు చెందిన ఫైళ్లను నేడు సునాయాసంగా క్లియర్‌ చేసేసి తమ ఉడతాభక్తిని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో అందిన ముడుపులు జిల్లాలోని ఒక ప్రధాన సెక్షన్‌ అఽధికారుల నుంచి పైస్థాయి అధికారులకు, పాలకులకు అందజేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

అప్పటి అధికారులకు తప్పు అనిపించిన ప్రక్రియ ఇప్పుడు అధికారులకు ఒప్పు అనిపించింది. అంతే 22ఏ జాబితా నుంచి తొలిగించడానికి పైల్‌రెడీ చేసేశారు. తహసీల్దార్‌, ఆర్డీఓ, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ఫైల్‌ సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపినట్లు సమాచారం. ఈ విషయంలో డీఆర్వో, జేసీ సంతకాలు చేయనట్లు తెలిసింది. సెక్షన్‌ సూపరింటెండెంట్‌ నుంచి నేరుగా కలెక్టర్‌ మెయిల్‌కు పంపారన్న చర్చ సాగుతోంది. ఈ విషయంలో భారీగా కాసులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఫైల్‌ మీద ఇప్పటివరకు సంతకాలు చేసిన అందరికీ సదరు నేత డబ్బులు ఇచ్చారని రెవెన్యూ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయం సమర్దించుకునేందుకు కూడా అధికారులు రెడీగా ఉన్నట్లు సమాచారం. 22ఎ జాబితా నుంచి అర్హులు భూములు తొలిగించడానికి ప్రభుత్వం జనవరి 1న ఒక సర్కిలర్‌ జారీ చేసింది. ఈ ప్రకారం ఈ బాధ్యత ఆర్డీఓలు, తహసీల్దార్లకు ఇచ్చింది. ముందే జాగ్రత్తపడిన కలెక్టరేట్‌లో కొందరు అధికారులు ఫైల్‌లు తొందరగా క్లియర్‌ చేస్తున్నట్లు చెప్పడం ఇందులో ఒకటి. రెండోది మాజీ సైనికుల వద్ద సరైన ఆధారం ఉంటే 22ఎ నుంచి తొలగించాలని ప్రభుత్వ ఆదేశం ద్వారా సమర్దించుకోవడం. ఏదైనా కాసులు చేతులు మారడం, భూమి మారిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

భూమి కథ ఇదీ..

భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూలో సర్వే నంబర్‌ 21, 27లో ఉన్న ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని దశాబ్దాల కిందట నలుగురు రైతులకు మాజీ సైనికుల కోటాలో ఇచ్చినట్లు అధికారులు చెబుతున్న మాట. ఒక్కొక్కరికి 1.5 ఎకరాల చొప్పున ఇచ్చినట్లు రికార్డులో నమోదు చేశారు. వాస్తవానికి వారు కూడా మాజీ సైనికులు కాదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ భూ మిని పోలిపల్లికి చెందిన అధికార పార్టీ నాయ కుడు ‘రాజు’లా వ్యవహరిస్తూ తన సోదరుడు పేరున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ మేరకు ఫైనల్‌ చెక్‌ ఆపరేషన్‌ (ఎఫ్‌సీఓ) రికార్డులో నమోదు చేశారు. కానీ తర్వాత అధికారులు ఆ భూమిని ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా 22ఎలో చేర్చారు. ఇదంతా జరిగి దాదాపు 15 ఏళ్లు గడిచిపోయింది. అప్పటినుంచి ‘సత్యం’ను మరుగున పెట్టి ఆ భూమికి 22ఏ జాబితా నుంచి తొలగించాలని అధికారులను అడుగుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు అక్కడ పని చేసిన తహసీల్దార్లు ఫైల్‌ పంపలేదు. తహసీల్దార్‌ పంపినా ఆర్డీఓలు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చినా కలెక్టరేట్‌లో సెక్షన్‌ సూపరెండెంట్‌ నుంచి డీఆర్వో, జేసీ, కలెక్టర్లలో ఎక్కడో చోట ఆగడంతో పని జరగలేదు.

వివాదాస్పద భూమి ఫైల్‌కు

ఇప్పుడు కదలిక..

వివాదాల పరిష్కారం మాటున భూదందా

మాజీ సైనికుని పేరిట భూమిని

కొట్టేసేందుకు యత్నం

చకచకా పరుగెడుతన్న ఫైళ్లు

సెంటుల్లెక్కన బేరాలు.. కోట్లలో వసూళ్లు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement