గడువు దాటితే..
పనులు పరిమితమే..
సాక్షి, పార్వతీపురం మన్యం:
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉపాధి హామీ పథకం స్వరూపం మారబోతోంది. దీని స్థానంలో కొత్త చట్టం వీబీజీ రామ్‌జీని కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చింది. గతం మాదిరి పరిమితి లేకుండా పనులు చేపట్ట డం కుదరదు. ఇప్పటి వరకు ఉపా ధి హామీ పథకం కింద చేపట్టిన పనులు రద్దు కానున్నాయి. ప్రధానంగా కొన్నేళ్లు గా సెల్ఫ్ ఆఫ్ వర్క్స్‌లో ఉన్న వాటిని తొలగించా ల్సి వస్తోంది. ఈ లెక్కన జిల్లాలో దాదాపు 64 వేల పనులు నిలిచిపోనున్నాయని అంచనా. కొద్దిరోజులుగా డ్వామా సిబ్బంది ఇదే పనిలో తలమునకలై ఉన్నారు. ఒకవైపు పాత పనులను తొలగిస్తూనే.. చాలాకాలంగా వదిలేసిన బిల్లులన్నింటినీ పూర్తి చేస్తున్నారు.
గ్రామాల్లో గతంలో వేలాది పనులను స్థానిక అవసరాలకు అనుగుణంగా చేపట్టేవారు. వివిధ శాఖలకూ పనులు అప్పగించేవారు. ఉపాధి నిధులతో సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్‌లు, గోకులాలు, సీసీ–బీటీ రహదారులు నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల పూర్తి కాగా.. మిగిలిన ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తి కాని పనులన్నీ తొలగిస్తే తప్ప.. కొత్తగా మంజూరయ్యే పరిస్థితి ఉండదు. వీటి బిల్లులు కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంది. మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టి న అభివృద్ధి పనులకు గడువు ముగుస్తోంది. మార్చి 15 నాటికి వీటిని పూర్తి చేయాలి. ఈ బిల్లులన్నీ వెనువెంటనే అప్‌లోడు చేయాల్సి ఉంది. లేకుంటే నిధులు కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. జిల్లాకు ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.214 కోట్ల విలువైన పనులు మంజూరయ్యా యి. రూ.114 కోట్ల వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. చేసిన పనులకు గానూ బిల్లులు కూడా పెద్ద మొత్తంలో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. దీంతో ఆ పనులు చేసిన గుత్తేదారులు కూడా బిల్లుల ఆందోళనలో ఉన్నారు. ఓవైపు లక్ష్యం అసంపూర్తిగా ఉండిపోవడమే కాక.. గడువు ముగిసినా వీటికి సంబంధించిన బిల్లులు చెల్లించకుంటే తమ పరిస్థితి ఏమిటని వారంతా ఆందోళన చెందుతున్నారు.
●డోలీ మోతలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఉపాధి హామీ నిధులతో గిరిశిఖర గ్రామాల్లో మార్గా లు ప్రతిపాదించారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రహదారుల నిర్మాణం, చెక్‌డ్యామ్‌లు, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, కాలువలు వంటి పనులకు అనుమతులొచ్చాయి. వీటిలో కొన్ని పనులు ప్రారంభం కాకపోగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లుల చెల్లింపులు కాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే నిలిపివేశారు. గడువులోగా పనులు చేయకుంటే.. నిధులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
జిల్లాలో 2.07 లక్షల జాబ్‌కార్డులున్నాయి. 2.79 లక్షల మంది పనులను ఉపయోగించుకుంటున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి నూతన చట్టం కింద వేతనదారులకు అందించే పనులు, వినియోగించే నిధుల్లో గరిష్టంగా 10 మాత్రమే ప్రగతిలో ఉండాలి. ఏదైనా పంచాయతీలో అవసరానికి అనుగుణంగా మరో పని చేపట్టాల్సి ఉన్నా.. అప్పటికే ఉన్న పనుల్లో ఒకటి తొలగించాల్సిందే. ఈ లెక్కన జిల్లాలో సుమారు 3,500 పనులు మాత్రమే ప్రగతిలో ఉంటాయి.


