● వరి, జొన్నపంటలు ధ్వంసం ● గగ్గోలు పెడుతున్న రైతులు
పార్వతీపురం: పాలకొండ పంచాయతీరాజ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్.రాధారాణి గురువారం కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై దృష్టిసారించాల ని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధకశాఖాధికారి ఎస్.మన్మథరావు పాల్గొన్నారు.
సీతంపేట: గిరిజనుల నుంచి సేకరించిన కొండచీపుర్లు, కుంకుడికాయలు, నల్లజీడి, పసుపుకొమ్ముల విక్రయానికి వచ్చేనెల 4న సీతంపేట ఐటీడీఏలో అడ్వాన్స్ టెండర్లు నిర్వహిస్తామని పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు సెల్:88972 23650ను సంప్రదించాలని కోరారు.
కొమరాడ: మండలంలోని మాదలింగి చెక్కవలస, పాలెం, వన్నాం తదితర గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. జొన్న, పామాయిల్, కర్భూజ, తదితర పంటలను నాశనం చేస్తున్నాయి. చేతికందొచ్చిన పంటలను నష్టపరుస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రాణనష్టం జరిగితే తూతూ మంత్రంగా రూ.5 లక్షలు ఇచ్చి చేతుల దులుపుకుంటున్న అటవీశాఖాధికారులకు పంట నష్టం కనిపించడంలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
● వరి, జొన్నపంటలు ధ్వంసం ● గగ్గోలు పెడుతున్న రైతులు


