పోలిపల్లి పైడితల్లి జాతర ఆదాయం రూ. 27.15 లక్షలు
రాజాం సిటీ:
ఎంతో వైభవంగా నిర్వహించిన రాజాంపోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతవార్షిక జాతర ఆదాయం రూ.27,15,381లు సమకూరిందని ఈఓ బీవీ మాధవరావు తెలిపారు. ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు జరిగిన జాతరలో వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ప్రత్యేక దర్శనం టికెట్ల అమ్మకంతో రూ.4,62,600, శీఘ్రదర్శనం టికెట్ల విక్రయంతో రూ.3,94,500, మొక్కుబడుల రూపంలో రూ.1,75,240, కానుకలు రూపంలో రూ.1,78,711లు, అద్దాలు, బరినెలు విక్రయించగా రూ.5వేలు, ప్రసాదం విక్రయంతో రూ.92వేలు, మూడు నెలల ఆదాయంతో కలిపి హుండీల నుంచి రూ.14,07,330ల ఆదాయం వచ్చిందన్నారు. గతేడాది రూ.23,94,054లు రాగా ఈ ఏడాది అదనంగా రూ.3,21,327లు వచ్చిందని వెల్లడించారు. లెక్కింపు ప్రక్రియలో సీఎఫ్‌ఓ, నవదుర్గ ఆలయ ఈఓ పి.శ్యామలరావు, ఆలయ ట్రస్టీ వాకచర్ల దుర్గాప్రసాద్, వాకచర్ల పైడిరాజు, అర్చకులు వేమకోటి సూర్యనారాయణశర్మ, సలాది తులసీదాస్, వెంపల లక్ష్మణరావు, ఆర్నిపల్లి వెంకటినాయుడు, భక్తులు పాల్గొన్నారు.


