బాల్యవివాహాలు జరిపిస్తే జైలుకే... | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలు జరిపిస్తే జైలుకే...

Feb 27 2026 7:45 AM | Updated on Feb 27 2026 7:45 AM

బాల్యవివాహాలు జరిపిస్తే జైలుకే...

బాల్యవివాహాలు జరిపిస్తే జైలుకే...

బాల్యవివాహాలు జరిపిస్తే జైలుకే...

పార్వతీపురం: ఎక్కడైనా బాల్యవివాహాలు జరిపిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బాల్య వివాహాలపై మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలు జరిపిన వారిపై పోక్సోకేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి, సబ్‌కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, అడిషనల్‌ ఎస్పీ వి.మణీషారెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు.

●మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీకి కలెక్టర్‌కు సూచించా రు. మత్తు పదార్థాలవల్ల కలిగే దుష్ఫలితాలు, బా ల్య వివాహాల కలిగే అనర్థాలు, బాలకార్మిక వ్యవస్థలపై అవగాహన కోసం పాఠశాల, కళాశాల స్థాయి లో క్విజ్‌ పోటీలు నిర్వహించాలన్నారు.

●వాహన చోదకులు రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని రహదారి భద్రతపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. లైసెన్స్‌లేని, హెల్మెట్‌ ధరించని వారి కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను రక్షించి తక్షణమే ఆస్పత్రికి చేర్చేవారికి ప్రభుత్వం రూ. 25వేలు బహుమతిగా అందిస్తుందన్నారు. దురదృష్ట వశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే 48 గంటల్లోగా ప్రమాదానికి సంబంధించిన పోలీస్‌ రిపోర్ట్‌ను సమర్పిస్తే ప్రభుత్వం రూ.1.50 లక్షలు పరిహారం అంద జేస్తుందన్నారు. సమావేశంలో ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి, జిల్లా రవాణాధికారి టి.దుర్గా ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

●జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను ఉగాది నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ఉగాది నాటికి జిల్లాలో 7,187 ఇళ్లను పూర్తి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement