విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తం కావాలి
జియ్యమ్మవలస రూరల్: వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం అందించాలని ఎస్సీ వసతిగృహ సంక్షేమ అధికారి శంకర్రావు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.శ్యామల ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం చినమేరంగి హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇస్తున్న మెనూ, వారు వినియోగిస్తున్న రూంల ను ఆమె పరిశీలించారు. స్టడీ అవర్స్ నిర్వహించి శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యూఓ స్వర్ణమని, సంక్షేమ అధికారి కె.శంకర్రావు పాల్గొన్నారు.
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా
సాలూరు: డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో ఒక్కొక్కరికి పదివేల రుపాయిలు చొప్పున ఏడుగురికి 70 వేల రుపాయిలను జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జరిమానా విధించినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో ఏడుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకోవడం జరిగిందన్నారు. వీరిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా వారికి జరిమానా విధించారని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి డ్రైవ్‌లు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ ఐటీఐ కళాశాల నైపుణ్య కేంద్రంలో జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలెపర్ కోర్సుకు మూడు నెలల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి, ఇంటర్, అంతకంటే పై చదువులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత ధృవపత్రాలు, తాధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలతో విటి.అగ్రహారం, విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు వచ్చే నెల 5వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.
413 మంది విద్యార్థులు గైర్హాజరు
పార్వతీపురం రూరల్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర మూడో పరీక్షకు మొత్తం 413 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 840 మంది విద్యార్థులకుగాను 760 మంది హాజరు కాగా, 80 మంది పరీక్షకు రాలేదు. ఒకేషనల్ విభాగంలో 2,957 మందికి గాను 2,624 మంది హాజరు కాగా, 333 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 3,797 మంది విద్యార్థుల్లో 3,384 మంది పరీక్షకు హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి వై.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
చిన్న పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ తోడ్పాటు
పార్వతీపురం రూరల్ : చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో తోడ్పాటు అందిస్తాయని జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ సీతారాం తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కల్లా జగపతి అధ్యక్షతన నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలుగా ముందుకు వచ్చే వారికి రూ.3 లక్షల వరకు రుణ సదుపాయంతో పాటు రాయితీ కల్పిస్తామన్నారు. నాణ్యమైన ఉత్పత్తుల తయారీ కోసం కేంద్ర ప్ర భుత్వం జెడ్ (జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్) సర్టిఫికెట్‌ను ఉచితంగా జారీ చేస్తోందని వివరించారు. కార్యక్రమంలో ఐపీఓ బ్రహ్మ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.సాగర్, సిబ్బంది సయ్యద్ చాన్, రమణ, దాడి సాయి, వివిధ సంఘాల ప్రతినిధులు గౌరీశ్వరరావు, గణపతి తదితరులు పాల్గొన్నారు.


