● కేజీబీవీ సిబ్బందికి ఏడాదిన్నరగా అందని జీతాలు ● విధుల్లో చేరిన నాటి నుంచి పైసా కూడా అందుకోని ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

● కేజీబీవీ సిబ్బందికి ఏడాదిన్నరగా అందని జీతాలు ● విధుల్లో చేరిన నాటి నుంచి పైసా కూడా అందుకోని ఉద్యోగులు

Mar 3 2026 7:31 AM | Updated on Mar 3 2026 7:31 AM

● కేజీబీవీ సిబ్బందికి ఏడాదిన్నరగా అందని జీతాలు ● విధుల్లో చేరిన నాటి నుంచి పైసా కూడా అందుకోని ఉద్యోగులు 15 నెలలుగా పని చేస్తున్నా..

వేతనాలు లేక కష్టంగా ఉంది...

ఇక్కడే ఆ సమస్య...

సుమారు 15 నెలల నుంచి పార్ట్‌టీం టీచరుగా పని చేస్తున్నాను. ఇప్పటి వరకు జీతాలు అందలేదు. అధికారులను కలసి అడుగుతున్నాం. త్వరలోనే జమ అవుతాయని చెబుతున్నారు.

– బి.శైలజ, కురుపాం

సాక్షి, పార్వతీపురం మన్యం:

వుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికనైనా.. ప్రభుత్వ ఉద్యోగమన్న ఆశతో వారంతా విధుల్లో చేరారు. నెలకు ఎంతో కొంత జీతమొస్తే.. కుటుంబానికి చేదోడుగా ఉంటుందని ఆశపడ్డారు. ఇప్పటికి ఉద్యోగంలో చేరి ఏడాదిన్నర కావస్తోంది. నేటికి ఒక్క పైసా కూడా అందుకోలేకపోయారు. వెట్టిచాకిరీనే మిగులుతోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. జిల్లాలోని పలు కేజీబీవీల్లో టైప్‌ 3, టైప్‌ 4 కింద 2024 నుంచి పలువురు నిరుద్యోగులు ఉద్యోగా ల్లో చేరారు. డే వాచ్‌ ఉమెన్‌, పార్ట్‌ టైం టీచర్లు, అసిస్టెంట్‌ కుక్స్‌.. ఇలా వివిధ పోస్టుల్లో పని చేస్తున్న 32 మందికి నేటికీ జీతాలు అందలేదు. ఇందులో సుమారు 8 నుంచి 15 నెలల కిందట చేరిన వారూ ఉన్నారు. పలుమార్లు జీతాల కోసం విద్యాశాఖ అధికారులను అడిగినా.. ఏదో సాంకేతిక కారణమని, ఆప్కాస్‌లో పేరు కలపాలని చెబుతున్నారే గానీ.. సమస్యను పరిష్కరించడం లేదు. దీంతో జీతాల కోసం వారంతా నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. వీరికి పోస్టును బట్టి నెలకు రూ.15 వేల నుంచి రూ.18,500 వరకు చెల్లిస్తామన్నారు. ఇప్ప టికి రూపాయి కూడా అందుకోలేకపోయామని వారంతా వాపోతున్నారు. తమ సమస్యను పరిష్క రించాలని సోమవారం కలెక్టర్‌ ప్రభాకరరెడ్డికి కలసి మొరపెట్టుకున్నారు.

ఒకటి కాదు, రెండు కాదు.. పదిహేను నెలలైంది విధుల్లో చేరి. కుక్‌గా పని చేస్తున్నా. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందుకోలేకపోయాం. ఇన్ని నెలల నుంచి జీతాలు లేకపోతే ఆర్థికంగా కష్టమే. ప్రభుత్వం స్పందించి మా సమస్య పరిష్కరించాలి.

– వి.శ్రీదేవి, కాశీపట్నం.

ఏడాదిన్నర కిందట విధుల్లో చేరిన కేజీబీవీ సిబ్బందికి ఇప్పటివరకు జీతాలు లేకపోవడం శోచనీయం. అన్ని నెలలుగా ఇవ్వకపోతే వారంతా కుటుంబాలతో ఎలా బతకగలరు. పక్క జిల్లాల్లో ఈ సమస్య లేదు. ఇక్కడే ఎందుకు వస్తోంది?

– పి.రంజిత్‌కుమార్‌, ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement