పరీక్ష కేంద్రాల వద్ద ‘ప్రత్యేక’ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రాల వద్ద ‘ప్రత్యేక’ ఏర్పాట్లు

Mar 7 2026 9:21 AM | Updated on Mar 7 2026 9:21 AM

పరీక్ష కేంద్రాల వద్ద ‘ప్రత్యేక’ ఏర్పాట్లు

పాలకొండ రూరల్‌: మరికొద్ది రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ పి. బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ మేరకు ఆయన పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచనలు చేస్తున్నారు.

● ఈ నెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా నుంచి ఈ ఏడాది 10,644 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 15 మండలాల పరిధిలో 68 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 99 మంది ఉన్నారు. వీరి సౌకర్యార్థం మార్కుల్లోనూ మార్పులు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

● శారీరకంగా దివ్యాంగులైన విద్యార్థులకు ఏదైనా ఒక లాంగ్వేజ్‌ పరీక్ష రాయకుండా మినహాయింపు కల్పించారు. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు సాధించాల్సి ఉంటుంది.

● కంటిచూపు సరిగా లేని విద్యార్థులకు ఒక లాంగ్వేజ్‌ పరీక్ష మినహాయింపుతో పాటు మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు రావాలి.

● వినికిడి లోపం గల వారు రెండు లాంగ్వేజ్‌ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు పొందాలి.

● మాట లోపం గలవారు ఒక్కో సబ్జెక్ట్‌లో 20 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అభ్యసనా వైకల్యం గల విద్యార్థులకు ఆంగ్లం మినహా మిగిలిన సబ్జెక్ట్‌ల్లో 15 మార్కులు పొందాల్సి ఉంటుంది.

● ఈ తరహా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కేంద్రాల వద్ద వీల్‌చైర్లు, ర్యాంపులు, వైద్య పరమైన సేవలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సదరు విద్యార్థులు సహాయకుల కోసం (స్రైబ్‌) దరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

డీఈఓ బ్రహ్మాజీరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement