● ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి
పార్వతీపురం రూరల్: గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ సి. యశ్వంత్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని ‘గిరిమిత్ర’ హాల్‌లో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ ఏ.మురళీధర్, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
224 మంది గైర్హాజరు
పార్వతీపురం రూరల్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. జంతుశాస్త్రం, అర్ధశాస్త్రం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 224 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్యాశాఖాధికారి వై. నాగేశ్వరరావు తెలిపారు. 5,987 మంది విద్యార్థులకు గాను 5,763 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు.


