ఆత్మాన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా ‘రవం’ | - | Sakshi
Sakshi News home page

ఆత్మాన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా ‘రవం’

Mar 6 2026 8:27 AM | Updated on Mar 6 2026 8:27 AM

ఆత్మాన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా ‘రవం’

విజయనగరం టౌన్‌: ఆత్మల అన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా రవం చిత్ర నిర్మాణం చేపట్టామని సినీనటి కళ్యాణి పేర్కొన్నారు. తారక్‌ ఫిల్మ్‌ హౌస్‌ బ్యానర్‌పై నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ఆహా ఓటీటీ ద్వారా విడుదలవుతుందన్నారు. సౌండ్‌ ఆఫ్‌ సోల్‌ క్యాప్షన్‌తో ప్రశాంత్‌, అనుశ్రీవర్మలు హీరోహీరోయిన్‌లుగా శ్రీరామ్‌ దర్శకత్వంలో అద్భుతంగా చిత్రం రూపుదిద్దుకుందన్నారు. నిర్మాత, సంగీత దర్శకునిగా తారక్‌ వ్యవహరిస్తున్నారన్నారు. నిర్మాతలుగా తారక రామారావు, కళ్యాణిలు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రం ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను ఆవిష్కరించారు. నిర్మాత తారకరామారావు మాట్లాడుతూ హారర్‌ , థ్రిలర్స్‌, సస్పెన్స్‌తో సాగే ఈ చిత్రం ఆద్యంతం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. శ్రీగురునారాయణ కళాపీఠం వ్యవస్థాపకులు బిఎ.నారాయణ మాట్లాడుతూ విద్యలనగరమైన విజయనగరంలో హరికథ, సంగీతంలో రాణించి సినీ ఇండస్ట్రీలో జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన కళ్యాణి, ఆమె సోదరుడు తారక్‌లు తొలిసారిగా నిర్మాతలుగా తీసిన రవం చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఈపు విజయకుమార్‌, గెద్ద వరప్రసాద్‌, భోగరాజు సూర్యలక్ష్మి, థీరజ్‌ వజ్రాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement