ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి : ఎన్‌టీఏ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి : ఎన్‌టీఏ

Mar 4 2026 7:20 AM | Updated on Mar 4 2026 7:20 AM

విజయనగరం గంటస్తంభం: ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌(ఎన్‌టీఏ) డిమాండ్‌ చేసింది. విజయనగరం యూత్‌ హాస్టల్‌లో జిల్లా అధ్యక్షుడు కె.జోగారావు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక హామీలను అమలు చేయడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ పలువురు ఉపాధ్యాయుల బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. 12వ పీఆర్‌సీ కమిటీని నియమించి ఐఆర్‌ 30 శాతం ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. పీఆర్‌సీ ఎరియర్లు, సరెండర్‌ లీవులు, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. వేసవి సెలవుల్లోనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమగ్రశిక్షలో పని చేస్తున్న ఐఈఆర్‌పీ ప్రత్యేక ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఒత్తిడిని తగ్గించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర అదనపు కార్యదర్మి ఎం.మురళి, రాష్ట్ర కార్యదర్మి చిప్పాడ సూరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు వై.శ్రీనివాసరావు, పి.రాంబాబు, జి.రవి, జిల్లా కార్యదర్ములు టి.నాగేశ్వరరావు, జి.కోటరావు, నాయుడు, ఐఈఆర్‌పీ ఉపాధ్యాయులు అప్పలనాయుడు, గీత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement