చిత్రంలో నడవలేని స్థితిలో బియ్యం కోసం రేషన్ దుకాణానికి వెళ్తున్న
వృద్ధురాలి పేరు రంపం సూరీడమ్మ. వీరఘట్టం డిపో–2 పరిధిలో ఆమె రైస్ కార్డు ఉంది. ప్రతినెలా బియ్యం కోసం డీలర్ ఇంటివద్దకు వచ్చి
వేలిముద్ర తీసుకుంటాడు. బియ్యం మాత్రం డిపో వద్ద ఇస్తారు. ఇంటికి తెచ్చి బియ్యం ఇవ్వాలని ఎన్నిసార్లు ఆమె మొరపెట్టినా ఫలితం లేకపోతోంది. వాస్తవంగా దివ్యాంగులు,
వృద్ధులకు ప్రతినెల వారి ఇంటి వద్దకే రేషన్ బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదనేందుకు సూరీడమ్మ ఎదుర్కొంటున్న కష్టాలే నిలువెత్తు నిదర్శం. ప్రతినెలా బియ్యం
తీసుకునేందుకు నడవలేని స్థితిలో అష్టకష్టాలుపడుతూ రేషన్ డిపోకు వెళ్తున్నట్టు ఆమె వాపోతోంది.
– వీరఘట్టం


