సహాయ నిరాకరణకు దిగిన గ్రామ సర్వేయర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ కొద్ది రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి సర్కారు న్యాయం చేయకపోవడంతో పోరుబాట
సాక్షి, పార్వతీపురం మన్యం :
తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించకపోతే మార్చి 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సహాయ నిరాకర ణ చేపడతామని ప్రకటించిన గ్రామ సర్వేయర్ల అసోసియేషన్.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అందుకనుగుణంగా కార్యాచరణలోకి దిగింది. గ్రామ సర్వేయర్లు గురువారం పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా.. శుక్రవా రం సైతం విధులకు హాజరు కాలేదు. జిల్లా సర్వే శా ఖ ప్రధాన కార్యాలయం వద్ద ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. రీసర్వే, స్వామిత్వ, భూసర్వేలకు సంబంధించిన పనులకు సహాయ నిరాకరణ చేశారు. ఆ శాఖ ఏడీకి వినతిపత్రం అందజేశారు.
గ్రామ సర్వేయర్లు జనవరి 27 నుంచి మూడు రోజు ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. జనవరి 30న రెవెన్యూ మంత్రి సమక్షంలో కమిటీ తో చర్చలు జరిపారు. స్వర్ణ గ్రామ వ్యవస్థలో సహచర సాంకేతిక ఉద్యోగుల వలె సమాన పే రోల్‌తో బేసిక్ పే, ఉద్యోగోన్నతులు కల్పిస్తామని.. ఫిబ్రవరి 15న ప్రపోజల్ ఫైలు నివేదిక తయారు చేస్తామని, రీ సర్వే నిర్వహణ కోసం ప్రతి గ్రామానికీ ఒక ల్యాప్‌టాప్, రోవర్, ప్రతి మండలానికీ ఒక ప్రింట ర్ ఏర్పాటు అందిస్తామని.. రీ సర్వే బిల్లులు ఫిబ్రవ రి మొదటి వారంలో విడుదల చేస్తామని హామీలిచ్చారు. గడువు దాటినా వాటిని అమలు చేయలేదు. కనీస వేతనం కూడా ఇవ్వకుండా వచ్చే ఆర్థిక సంవత్సర ఇంక్రిమెంట్‌ను కలిపి ప్రస్తుతం ఉన్న జీతాన్నే కేవలం పోస్టు పేరు మార్చి, పైసా ప్రయోజనం లేకుండా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. దీనిపై ఫిబ్రవరి 23న సర్వే శాఖ డైరెక్టర్‌కు నోటీసు అందజేశారు. మార్చి 4వ తేదీలోపు ప్రధా న డిమాండ్లు పరిష్కరించకపోతే సర్వేలకు సహాయ నిరాకరణ చేపడతామని స్పష్టం చేశారు. ఆ ప్రకా రం రాష్ట్ర యూనియన్ నిర్ణయంతో ఆందోళనకు సిద్ధమయ్యారు.
జిల్లా వ్యాప్తంగా 965 రెవెన్యూ గ్రామాల పరిధిలో 5,71,888 ఎకరాల్లో రీసర్వే చేయాల్సి ఉంది. మూడో విడత చివరి దశకు రాగా.. నాలుగో విడత ప్రస్తుతం జరుగుతోంది. ఓ వైపు రీసర్వే జరుగుతుండగానే.. అధికారులు రూపొందించిన ముసాయిదా రికార్డులను రైతుల సమక్షంలో ఉంచి, ఈకేవైసీ ద్వారా ఆమోదం తీసుకుంటున్నారు. పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రీ సర్వే చేయాల్సిన 612 గ్రామాలనూ పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓ వైపు పనిభారం పెరుగుతోంది. ఉన్నతాధికారుల ఒత్తిడి అధికమవుతోంది. అందుకనుగుణంగా పరికరాలను, సౌకర్యాలను ప్రభుత్వం కల్పించడం లేదు. జిల్లాలో 237 మంది గ్రామ సర్వేయర్లు పని చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి, రీసర్వేకు గానీ వ్యతిరేకం కాదని.. తమ 30 సంవత్సరా ల ఉద్యోగ భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వారంతా చెబుతున్నారు. సుమారు ఆరేళ్లుగా అహర్నిశలూ శ్రమిస్తూ, అడవుల్లో సర్వే నిర్వ హిస్తూ.. ప్రమాదాలకు గురై, అధిక ఒత్తిడితో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతమైన రికార్డుల రూపకల్పన కోసం తగిన పరికరాలు, సమయం కల్పించాలని కోరుతున్నారు. రూ.25,220 బేసిక్ పే, రూ.6 వేలు గ్రేడ్ పే ప్రతిపాదనపై తాము విముఖత వ్యక్తం చేస్తున్నట్లు చెప్పా రు. రూ.29,980 బేసిక్ పే, మూడు వేల అసిస్టెంట్ సర్వేయర్ పోస్టుల ప్రతిపాదన సరికాదని అంటున్నారు. బేసిక్ పే రూ.30 వేలు ఉండాలన్నది తమ ప్రధాన డిమాండు అని చెబుతున్నారు. ప్రభుత్వం వీటిపై సానుకూలంగా స్పందించడంతో పాటు.. తమ నాయకులపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని కోరుతున్నారు. క్షేత్ర స్థాయి విధుల్లో కీలమైన గ్రామ సర్వేయర్లు సహాయ నిరాకరణ చేయడంతో ఆ ప్రభావం రీ సర్వేపై పడనుంది.


