జాతి గౌరవానికి భంగం కల్పించారంటూ రెల్లి సంఘాల ఆందోళన అసెంబ్లీ రికార్డుల నుంచి అనుచిత పదజాలం తొలగించాలని డిమాండ్ కలెక్టర్‌కు వినతి
పార్వతీపురం రూరల్: తమ సామాజిక వర్గ మనోభావాలను దెబ్బతీసేలా అసెంబ్లీలో మాట్లాడిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యాఖ్యలపై రెల్లి కులస్తులు నిరసన గళం వినిపించారు. పండ్లు, కాయల వ్యాపారం చేసుకుంటూ గౌరవంగా జీవిస్తున్న తమ జాతిపై ‘సారాయి’ ముద్ర వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రెల్లి ఎస్సీ ఉపకులాల సంక్షేమ సంఘం, పార్వతీపురం పట్టణ రెల్లి సంఘం ప్రతినిధులు సంయుక్తంగా జిల్లా కలెక్టర్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తమ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధా కరమని సంఘం నాయకులు పేర్కొన్నారు. హైద రాబాద్‌లోని దూల్‌పేట ప్రాంతంతో పోల్చుతూ.. నాటుసారా తయారీ, విక్రయాలు కేవలం రెల్లి జాతి వారే చేస్తున్నారన్నట్లుగా మాట్లాడడం తమ గౌరవానికి భంగం కలిగించడమేనని వివరించారు. ఎమ్మె ల్యే తన మాటలను బహిరంగంగా వెనక్కి తీసుకోవాలని, అసెంబ్లీ రికార్డుల నుంచి ఆ పదజాలాన్ని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
అభివృద్ధిపై దృష్టి సారించండి...
అనేక సమస్యలతో సతమతమవుతున్న తమ సామాజిక వర్గాన్ని ఆదుకోవాల్సింది పోయి కించపరచడం తగదని నేతలు పేర్కొన్నారు. రిజర్వేషన్ల ఫలాల్లో అన్యాయం జరుగుతున్నా, ఎస్సీ వర్గీకరణ లో ఆశించిన వాటా దక్కకపోయినా దీన స్థితిలో మౌనంగా భరిస్తున్నాం. ఉషా మెహ్రా కమిషన్ పేర్కొన్న విధంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగా ల్లో తీవ్రంగా వెనుకబడిన మా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. సారాయి విక్రయాల్లో ఇతర కులస్తుల పాత్ర కూడా ఉన్నప్పటికీ, కేవలం ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని వారు స్పష్టం చేశారు. పార్వతీపురం పోలీస్ రికార్డులలో సారాయి కేసుల్లో ఉన్న ఇతర సామాజి క వర్గాల వివరాలను కూడా బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తమ న్యాయమై న డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.


