విజయనగరం: మహాబలుడు కోడి రామ్మూర్తినాయుడు స్ఫూర్తిని యువతలో కలిగించేందుకు విజయనగరం జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 22న ఉమ్మడి విజయనగరం జిల్లా బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శంకరరావు తెలిపారు. స్థానిక గురజాడ కళాభారతిలో పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక బాడీ ఫిట్‌నెస్ జిమ్‌లో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావుతో కలిసి పోటీలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించార. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ..55 నుంచి 75 కిలోల విభాగాల్లో ఆరు కేటగిరీల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. పోటీల్లో బాడీబిల్డర్లు పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు నమ్మి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ అజయ్, అసిస్టెంట్ సెక్రటరీ డి.సన్నిబాబు, ఎల్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


