విజ్ఞానంతో మానసిక వికాసం | - | Sakshi
Sakshi News home page

విజ్ఞానంతో మానసిక వికాసం

Mar 7 2026 9:21 AM | Updated on Mar 7 2026 9:21 AM

విజ్ఞానంతో మానసిక వికాసం

వీరఘట్టం: విజ్ఞానంతోనే మానవ వికాసం సాధ్యమని పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప విద్యాశాఖాధికారి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సుకు శాస్త్ర విజ్ఞానం ఎంతో దోహదపడుతుందన్నారు. సృజనాత్మక, నూతన ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఫ్యాన్సీ డ్రెస్‌, సెమినార్స్‌, క్విజ్‌, డిబేట్‌, పోస్టర్‌ ప్రజెంటేషన్‌లలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా.. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి జి,లక్ష్మణరావు, విద్యాశాఖాధికారులు సీహెచ్‌ రత్నాకరరావు, జి.రవిప్రసాద్‌, బి.సొంబర, ఎం.ఈశ్వరరావు, కేపీ నాగమణి, పెంట రామకృష్ణ, చొక్కాపు శ్రీనివాసరావు, కె.శివ, శిర్లాపు ఉమామహేశ్వరరావు, మరడాన సంపత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

సీనియర్స్‌ పోస్టర్‌ ప్రజెంటేషన్‌ విభాగంలో

విజేతలు వీరే..

పోస్టర్‌ ప్రజంటేషన్‌లో గరుగుబిల్లి మండలం రావివలస జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన కె,ప్రసన్న మొదటి బహుమతి.. సాలూరు మండలం బోరబంద జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన జి.హారిక రెండో బహుమతి, భామిని మండలం ఏపీఎంఎస్‌కు చెందిన ఎస్‌.రేష్మ తృతీయ బహుమతి పొందారు.

ఫ్యాన్సీ డ్రెస్‌ విభాగంలో..

సాలూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన కె.భువనచంద్ర, పాచిపెంట మండల పాంచాలి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన కె.వంశీకృష్ణ, వీరఘట్టం మండలం రేగులపాడు కేజీవీకి చెందిన ఎం.గీత విజేతలుగా నిలిచారు.

డిబేట్‌లో..

గరుగుబిల్లి మండలం రావివలస జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన జి.తేజశ్వని, వీరఘట్టం మండలం పాలమెట్ట యూపీ స్కూల్‌ విద్యార్థిని పి.సౌజన్య వరుస స్థానాల్లో నిలిచారు.

క్విజ్‌ పోటీలో..

సీతానగరం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన వై.తేజశ్వని, బి.కీర్తి, పి.అక్షయలు మొదటి స్థానంలో.. పార్వతీపురం మండలం ములగ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన సీహెచ్‌, భవిక, వై.గాయత్రి, వై.సంతోషికుమారి ద్వితీయ స్థానంలో.. గరుగుబిల్లి మండలం రావివలస జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన బి.కావ్య, సీహెచ్‌.సుధీర్‌, బి.గుణశేఖర్‌ తృతీయ స్థానాలు సాధించారు.

జూనియర్స్‌ విభాగం పోస్టర్‌ ప్రజెంటేషన్‌లో..

పాలకొండ నగరపంచాయతీలోని వెంకమ్మపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన జె.కారుణ్య, సీతంపేట జీటీడబ్ల్యూఏహెచ్‌ఎస్‌కు చెందిన ఎం.హిమశ్రీ, సాలూరు ఎంపీఎల్‌పీఎస్‌కు చెందిన జి.నికేష్‌నందన్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.

ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీల్లో..

పార్వతీపురం మున్సిపల్‌ ప్రైమరీ స్కూల్‌కు చెందిన రితిక్‌ రెడ్డి, జీఎల్‌ పురం జీటీడబ్ల్యూఏజీహెచ్‌ఎస్‌కు చెందిన ఎం.సుమతి, సాలూరు ఎంజేపీఎస్‌కు చెందిన వై.శరణ్య విజేతలుగా నిలిచారు.

క్విజ్‌ పోటీల్లో..

వీరఘట్టం మండలం పాలమెట్ట యూపీ స్కూల్‌ విద్యార్థులు ఎన్‌.అక్షయ, ఎం,హిమశ్రీ, జేఆర్‌ లాస్యప్రియ మొదటి స్థానంలో.. పాలకొండ నగరపంచాయతీలోని వెంకమ్మపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు టి.జ్ఞానశ్రీ, జి.మోక్షిత, డి.శిరీషా ద్వితీయ స్థానంలో.. పార్వతీపురం దత్తుపేట ఎంపీఎల్‌పీఎస్‌కు చెందిన ఎం.లీలాకుమార్‌ తృతీయ స్థానాల్లో నిలిచారు.

ఘనంగా విజ్ఞాన వారోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement