జీసీసీ డీఎంగా అదనపు బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

జీసీసీ డీఎంగా అదనపు బాధ్యతలు

Mar 4 2026 7:20 AM | Updated on Mar 4 2026 7:20 AM

సీతంపేట: సీతంపేట గిరిజన సహకార సంస్థ డివిజనల్‌ మేనేజర్‌గా దాసరి కృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఈయన స్థానిక బ్రాంచ్‌ మేనేజర్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు డీఎం పోస్టులో ఎఫ్‌ఏసీగా నియమించారు. ఇప్పటి వరకు జీసీసీ జనరల్‌ మేనేజర్‌ జి.సంధ్యారాణి ఇక్కడ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వహించే వారు.

యువకుడి అదృశ్యంపై కేసు

సంతకవిటి: మండలంలోని వాసుదేవపట్నం గ్రామానికి చెందిన మజ్జి గిరిబాబు(35) 2024వ సంవత్సరంలో ఇంటి నుంచి పని నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లాడు. అనంతరం కొద్ది రోజులు తల్లి దండ్రులతో ఫోన్‌లో సంభాషణలు జరిపారు. కొద్ది నెలల నుంచి గిరిబాబు తల్లిదండ్రులతో మాట్లాడడం లేదు. దీంతో తోడు చాలా రోజుల నుంచి ఇంటికి తిరికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల నుంచి సమాచారం సేకరించారు. ఎవరింటికీ రాలేదని చెప్పడంతో తండ్రి వెంకన్న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. అందిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఆర్‌.గోపాలరావు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

భామిని: మండలంలోని మనుమకొండకు చెందిన బిడ్డిక వెంకన్న(55) శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు బత్తిలి ఎస్‌ఐ జి.అప్పారావు తెలిపారు. సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంలో బత్తిలి నుంచి మనుమకొండ వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడు వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 వాహనంలో సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భార్య బిడ్డిక రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

చెరువులో పడి వివాహిత మృతి

శృంగవరపుకోట: పట్టణంలోని స్థానిక జగ్గు చెరువులో పడి వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పుణ్యగిరి రోడ్డులో నివాసం ఉంటున్న కోట దేవి(33) మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తానంటూ భర్తతో చెప్పి చెరువుకి వెళ్లింది. కాగా ఆమె ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవటంతో భర్త కోట గోపి చెరువు వద్దకు వెళ్లి చూడగా భార్య దేవి చెరువులో పడి శవమై తేలి ఉంది. మృతురాలి భర్త గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌.కోట సీఐ నారాయణమూర్తి తెలిపారు.

18.54 లీటర్ల మద్యం ధ్వంసం

సీతానగరం: పార్వతీపురం అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరిటెంటెండ్‌ ఎ.సంతోష్‌ ఆధ్వర్యంలో మంగళవారం సీతానగరం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సర్కిల్‌ పరిధిలో వివిధ దాడుల్లో పట్టుబడి అక్రమ మద్యం 18.54 లీటర్లు ధ్వంసం చేసినట్టు ఇన్‌స్పెక్టర్‌ డి.పద్మావతి తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తన సిబ్బందితో కలిసి స్టేషన్‌ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 18.54 లీటర్లఅక్రమ మద్యం ధ్వంసం చేసినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement