ముగిసిన పారా బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలు
● జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటాలి : ఖలీల్ బాబు
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయనగరం రాజీవ్ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న 7వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరత్ ఖాదర్ వలి బాబా పుణ్యక్షేత్రం ధర్మకర్త డాక్టర్. మహమ్మద్ ఖలీల్ బాబు హాజరై విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పారా క్రీడాకారుల సంకల్పం గొప్పదని, జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలైన వారు మార్చి 6 నుంచి 10 వరకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరగబోయే జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో పాల్గొంటారని అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు (శాప్) వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యాయవాది నాలుగెస్సులరాజు పాల్గొన్నారు.


