బలిజిపేట: మండలంలని వంతరాం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పి. చిన్నారావు (25) గాయపడినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సతివాడ పంచాయతీ గొలుగువలస గ్రామానికి చెందిన చిన్నారావు ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం వంతరాం నుంచి గొలుగువలస వైపు వెళ్తుండగా.. రాజాం నుంచి బలిజిపేట వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారావుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి రాజాం కేర్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సింహాచలం తెలిపారు.


