● 20 మందికి గాయాలు
గజపతినగరం: ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో సుమారు 20 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సాలూరు నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గజపతినగరం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని ఒక్కసారిగా ఢీ కొట్టింది. లారీ సడన్ బ్రేక్ వేయడంతో జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సుమారు 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన గూడెపు సంతోష్, వర్రి లక్ష్మి, కె.పార్వతి, కె.లచ్చమ్మ, తూ ముల రామకృష్ణ, అలమండ కొండ, ఎం.నాగ మణి, జి.సత్తెమ్మ, పి.నిర్మల, కె.సత్తయ్య, కె.రాము, ఎం.నాగమణి, కె.వాసు, ఎ.కొండమ్మ, జి.పార్వతి, గౌరినాయుడు, తదితరులను స్థానిక సీహెచ్‌సీకి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


