● విజయనగరం జేఏసీ చైర్మన్‌గా పైడిరాజు
● పార్వతీపురం అధ్యక్షుడిగా కిషోర్
విజయనగరం కలెక్టరేట్: జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) విజయనగరం జిల్లా అధ్యక్షులుగా ఎ.సురేష్ , కార్యదర్శిగా పైడిరాజు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని విజయనగరం ఏపీ ఎన్జీఓ హోంలో మంగళవారం ఎన్నుకున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు సభ్యులుగా ఉన్న జేఏసీలో 35 మందితో కూడిన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతన చైర్మన్‌గా సురేష్‌ను మళ్లీ ఎన్నుకున్నారు. కోశాధికారిగా కె.చంద్ర శేఖర్, అసోసియేషన్ కో చైర్మన్‌లుగా వలిరెడ్డి రవీంద్ర నాయుడు, పి.జి.రాఫెల్, టి.శ్రీధర్ బాబు, వైస్‌చైర్మన్‌లుగా అప్పారావు, వి.రమణ, కె. శ్రీనివాసరావు, ఎం.మదన్‌మోహన్, ఎస్.రాము, సి.హెచ్ మురళి, కె.శ్రీనివాసరావు, కె.ఆదిలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాయింటు సెక్రటరీలుగా బి.శ్రీనివాస్, టి.వెంకటరావు, డి.శ్యామ్, ఎం.సూర్యనారాయణ మూర్తి, కె.రాజు ఎస్‌ఆర్‌సీ హెచ్.కృష్ణారావు, లక్ష్మణరావు, ఐ.వి.సత్యనారాయణ ఎన్నిక కాగా ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కొందరు, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 14 మందిని ఈసీ మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పార్వతీపురం రూరల్: మన్యం జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానికంగా నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొని కార్యవర్గాన్ని ప్రకటించారు. జేఏసీ ఆవశ్యకతను, రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు ఉద్యోగుల ఐక్యతను బలోపేతం చేయాల్సిన బాధ్యతను జి.వి.ఆర్.ఎస్.కిషోర్ వివరించారు. సమావేశంలో ఏపీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి రంగాచారి, ఆర్టీసీ(ఎన్.ఎం.యూ), వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడుగా జి.వి.ఆర్.ఎస్.కిషోర్, కో–చైర్మన్లుగా ఎన్.బాలకృష్ణ, కె.శంకరరావు, కె.రంగాచారిలు, వైస్ చైర్మన్లుగా కె.భాస్కరరావు, అమరాపు సూర్యనారాయణ, పి.కూర్మి నాయుడు, మజ్జి మురళి బాబు, సెక్రటరీ జనరల్‌గా చల్లా రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె.విజయ్ కుమార్, కోశాధికారిగా సువ్వాడ దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీలుగా పి.శ్రీరాములు, సిహెచ్.గణపతి, ఎ.బాలాజీ రావు, డి.గణపతిరావు, జి.ఎం.రత్నం, జ్యోత్స్న ఎన్నికయ్యారు. ప్రతి నెలా జిల్లా జేఏసీ సమావేశం నిర్వహించాలని, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పెండింగ్ డీఏలు, పీఆర్‌సీ, సీపీఎస్ రద్దు వంటి సమస్యలపై ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో తీర్మానించారు.


