పార్వతీపురం: జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్(సీఎస్‌సీ) పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ డా.ప్రభాకర్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. తన కార్యాలయం నుంచి ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంజినీరింగ్ అధికారి తమ రోజువారీ ప్రగతిని వివరించాలన్నారు. పనుల నిర్వహణలో ప్రతీ అధికారి కి ఒక స్పష్టమైన ప్రణాళిక, వ్యూహం ఉండాలన్నా రు. నిర్మాణాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఐటీడీఏ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మా ణం తప్పనిసరిగా చేయాలన్నారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్‌కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణాంధ్ర–2047 క్యాలెండర్ ఆవిష్కరణ
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన స్వర్ణాంధ–2047 క్యాలెండర్‌ను కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్‌రెడ్డి, జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలితో పాటు పలువురు అధికారులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లా అధికారుల చొరవ, సహకారంతో మన్యం జిల్లా ముందంజలో ఉందన్నారు.
జిల్లా ముందంజలో ఉండాలి
స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడంలో జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ప్రాధమిక రంగాల్లో పురోగతి కనిపించాలన్నారు. రాష్ట్ర స్థాయి డేటాను పరిశీలించి దానిని మండలాల వారీగా విశ్లేషించుకొని క్షేత్ర స్థాయి లక్ష్యాలను చేరుకొనేందుకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ప్రతీ జిల్లా అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ముస్తాబు గ్రామంగా తయారు చేయాలన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయడానికి వినూత్నంగా ‘ఈ–టామ్‌టామ్’ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సమీక్షలో జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ హేమలత తదితరులు పాల్గొన్నారు.


