గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలి

Mar 3 2026 7:31 AM | Updated on Mar 3 2026 7:31 AM

గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలి

పార్వతీపురం: జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణా ల లక్ష్యాలను ఉగాదినాటికి సాధించాలని ఇన్‌చార్జి జేసీ పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో గృహనిర్మాణ ప్రగతిపై సోమవారం సమీక్షించారు. జిల్లాలో 34,965 గృహాలు మంజూరుకాగా ఇంత వరకు 20,859 గృహనిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఉగాది నాటికి 7,087 గృహ నిర్మాణాలను పూర్తిచేయాలని పేర్కొన్నారు. సీతంపేట, కురు పాం, గుమ్మలక్ష్మీపురం మండలాలు ముందువరుస లో ఉండగా, మిగిలిన మండలాల్లో గృహనిర్మాణా లు మందకొడిగా సాగుతున్నాయని తెలిపారు. సమావేశంలో డీపీహెచ్‌ఐఓ వంశీకృష్ణ పాల్గొన్నారు.

వినతులను తక్షణమే పరిష్కరించాలి

పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్లను ఇన్‌చార్జి జేసీ ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్‌ అంశా లు, వినతుల పురోగతిపై తహసీల్దార్లతో ఆయన సమీక్షించారు. భూ సర్వే ప్రక్రియ, హద్దుల నిర్ణయం, సబ్‌డివిజన్‌ పనులపై ఎప్పటికప్పుడు జా ప్యం లేకుండా చూడాలన్నారు. నిర్దేశించిన గడువులోగా రెవెన్యూ పనుల్లో పురోగతి చూపకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement