మలయాళ నటుడు ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కటాలన్. దుషారా విజయన్ కథానాయిక. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్‌లో.. మలయాళ మూవీ చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ఆంటోనీ వర్గీస్‌ను పరిచయం చేశారు. శుక్రవారం (జనవరి 16న) ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించగా షరీఫ్ మహమ్మద్ నిర్మించాడు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను థాయ్‌లాండ్‌లో, ఓంగ్-బాక్ సిరీస్‌తో సహా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ, అతని బృందం ఆధ్వర్యంలో చిత్రీకరించారు.
ఓంగ్-బాక్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "పాంగ్" అనే ఏనుగు కూడా ఈ సినిమాలో కనిపించనుంది. అజనీష్ సంగీతం అందించిన ఈ మూవీలో సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాజ్ తిరందాసు, పార్థ్ తివారి తదితరులు కీలక పాత్రల్లో నటింనున్నారు. కటాలన్ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మే 14న విడుదల కానుంది.


