తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య | VN Aditya Elected As President Of Telugu Film Directors Association, Know More Details Inside | Sakshi
Sakshi News home page

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య

Mar 8 2026 6:26 PM | Updated on Mar 8 2026 7:00 PM

VN Aditya elected as president of Telugu Film Directors Association

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులుగా వీఎన్ ఆదిత్య ఎన్నికయ్యారు. ఇవాళ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా సముద్ర ఎంపిక కాగా.. ప్రధాన కార్యదర్శిగా రామారావు.. ట్రెజరర్‌గా దర్శకుడు సాయి రాజేశ్ గెలిచారు.

ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని నూతన అధ్యక్షులు వి ఎన్ ఆదిత్య తెలిపారు. మేము చేసిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అసోసియేషన్ సభ్యులకు ఆరోగ్య భద్రత, సినిమా నిర్మాణంలో సహాయం చేస్తామని వెల్లడించారు. మా ప్యానెల్‌లో 18మంది పోటి చేస్తే 16 మంది గెలిచారని అన్నారు. నన్ను డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement