ఓటమితో వీడ్కోలు.. టెన్నిస్‌ స్టార్‌ కన్నీటి పర్యంతం | Eugenie Bouchard Gets Emotional on 1st Day of Retirement | Sakshi
Sakshi News home page

ఓటమితో వీడ్కోలు.. టెన్నిస్‌ స్టార్‌ కన్నీటి పర్యంతం

Aug 1 2025 12:41 PM | Updated on Aug 1 2025 1:27 PM

Eugenie Bouchard Gets Emotional on 1st Day of Retirement

ఓటమితో టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన కెనడా ప్లేయర్‌  

మాంట్రియల్‌: కెనడాకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ జెనీ బుచార్డ్‌ ఆటకు వీడ్కోలు పలికింది. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడేసింది. నేషనల్‌ బ్యాంక్‌ ఓపెన్‌లో భాగంగా గురువారం మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో బుచార్డ్‌ 2–6, 6–3, 4–6తో 17వ సీడ్‌ బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో ఓడింది. 

తొలి రౌండ్‌లో పోరాడి గెలిచిన బుచార్డ్‌... రెండో రౌండ్‌లో అదే ఆటతీరు కనబర్చలేకపోయింది. 2 గంటల 16 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో... తొలి సెట్‌లో ఓడిన బుచార్డ్‌... ఆ తర్వాత పుంజుకుంది. 

రెండో సెట్‌ గెలిచి... మూడో సెట్‌లోనూ చక్కటి పోరాటం కనబర్చినా... కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన బెన్‌చిచ్‌ విజయం సాధించింది. 

ప్రత్యేక అనుబంధం
‘మాంట్రియల్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి ఎదో ఒక రోజు ఇదే మైదానంలో ఆటకు వీడ్కోలు పలకాలని బలంగా అనుకునే దాన్ని. ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. ఇదో భావోద్వేగ సందర్భం. 

కెరీర్‌లో సాధించిన దాంతో సంతృప్తిగా ఉన్నా’ అని బుచార్డ్‌ పేర్కొంది. 2014లో కెరీర్‌ అత్యుత్తమ దశలో ఉన్న సమయంలో బుచార్డ్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 5వ స్థానానికి చేరింది. 

ఆ ఏడాదే కెరీర్‌లో ఏకైక డబ్ల్యూటీఏ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన ఆమె.... ఆ్రస్టేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నల్లో సెమీఫైనల్‌కు చేరింది. 2014లో వింబుల్డన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయిన బుచార్డ్‌... తిరిగి పుంజుకోలేకపోయింది. 

కన్నీటి పర్యంతం
‘ఎన్నో కష్టనష్టాలు ఓర్చి ఇక్కడి వరకు వచ్చా. టెన్నిస్‌ ధ్యాసలో పడి చదువుకు దూరమయ్యా. ఇష్టాలను వదులుకొని ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకున్నా. నేను ఆటకు ఎంతో ఇచ్చాను. ఇక ఆటకు వీడ్కోలు పలికి ఇతర విషయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. 

టెన్నిస్‌ నాకు తిరిగిచి్చన దాంతో సంతృప్తిగా ఉన్నా. చిన్నప్పుడు ఈ మైదానంలో కూర్చొని మ్యాచ్‌లు వీక్షించేదాన్ని. ఏదో ఒక రోజు ఈ కోర్టులో అడుగు పెట్టాలని కలలు కనేదాన్ని. అది నిజం చేసుకొని సగర్వంగా ఇక్కడే ఆటకు వీడ్కోలు పలుకుతున్నా’ అని మ్యాచ్‌ అనంతరం బుచార్డ్‌ కన్నీటి పర్యంతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement