ఇటీవల కాలంలో అన్ని దేశాలను విసిగించినట్లు కెనడాకు అత్యంత చిరాకు తెప్పిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాము లేకపోతే కెనడానే లేదని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఆ దేశం తాను ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్‌కు మద్దతు తెలపకపోవడంతో అత్యంత అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమకు మద్దతు తెలపని దేశాలను గుర్తుపెట్టుకుంటామని కూడా ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో కెనడా కృతజ్ఞత లేని దేశమని కూడా హాట్ కామెంట్స్ చేశారు.
దీనికి ఇప్పటికే కెనడా ప్రధాని మార్క్ కార్నే కౌంటర్ కూడా ఇచ్చారు. తాము ఎవరి మీద ఆధారపడి బతకడం లేదని, కెనడియన్లకు ఒక స్థానం ఉందని, తాము కెనడాకు చెందిన వారేమనని అమెరికాకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాము ఎప్పటికీ అమెరికాకు 51వ రాష్ట్రంగా ఉండబోమని తెగేసి చెప్పారు కార్నే.
అయితే కెనడా ప్రధాని కార్నే.. భారత్ పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలో ఆయన భారత్‌లో పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నారు. భారత్‌తో కెనడాకు ఉన్న సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు పలు ట్రేడ్ డీల్స్ ఒప్పందం చేసుకునేందుకు కార్నే.. భారత్‌కు పర్యటన చేపట్టబోతున్నారు.
ఇదే విషయాన్ని సూచనప్రాయంగా ధృవీకరించారు భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్. కెనడా ప్రధాని కార్నే.. భారత పర్యటన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్ తర్వాత ఉండొచ్చన్నారు.
ఇదీ చదవండి:


