అమెరికా-కెనడాల మధ్య డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ అగ్గి రాజేస్తుంది. ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ పీస్ బోర్డుకు కెనడా సమ్మతి తెలపకపోవడంతో అది మరొక వివాదానికి దారి తీసింది. తమకు సహకరించని దేశాలను గుర్తుపెట్టుకుంటామని వ్యాఖ్యానించిన ట్రంప్.. కెనడాపై మాత్రం పెరు పెట్టి మరీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కెనడా కృతజ్ఞత లేని దేశం అంటూ నిప్పులు చెరిగారు. తమ వల్లే ఆ దేశం మనుగడలోకి వచ్చిందని, ఇప్పటికీ తామే ఆదేశానికి ఆధారమని ధ్వజమెత్తారు. దీనిపై కెనడా ఘాటుగా స్పందించింది.
ట్రంప్.. ఇక మీ మాటలు చాలంటూ ఘాటుగా బదులిచ్చింది. దీనిపై కెనడా ప్రధాని మార్క్ కార్నే మాట్లాడుతూ.. తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. తమ ఎవరి మీద ఆధారపడి బతకడం లేదని, కెనడియన్లకు ప్రత్యేకమైన జీవన స్థితిగతులు ఉన్నాయన్నారు. ‘ అమెరికా వల్ల కెనడియన్లు జీవించడం లేదు. కెనడా అభివృద్ధి చెందుతోంది ఎందుకంటే మనం కెనడియన్లం’ అని స్పష్టం చేశారు.
అదే సమయంలో బోర్డ్ ఆఫ్ పీస్‌లో తమను జాయిన్ అవ్వమని ట్రంప్ నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని కార్నే అంగీకరించారు. ఆయన రెండు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన భాగస్వామ్యాన్ని కూడా ఒప్పుకున్నారు. కాకపోతే తమకు ప్రత్యేక అభిప్రాయాలుంటాయనే విషయాన్ని కార్నే తేల్చిచెప్పారు. ఆ బోర్డుకు అత్యధిక మొత్తంలో చెల్లించడానికి తాము సిద్ధంగా లేమని తెగేసి చెప్పేశా
కాగా, ఇక దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోఅమెరికా ఆధిపత్యంపై సెటైర్లు వేశారు. అమెరికా ఆధిపత్యం తగ్గిపోతున్నదని, మధ్యస్థ శక్తులు కలిసి కొత్త సహకార ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ శాంతి కూటమికి కెనడా దూరంగా ఉంది. అయితే ట్రంప్ మాత్రం కెనడాపై రెచ్చిపోయి ప్రసంగించడంతో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎటు దారితీస్తాయో అనే చర్చ మొదలైంది.
ఇదీ చదవండి:
Trump: మరో కొత్త తలనొప్పి..!


