బరువు తగ్గడం అనే ప్రక్రియ కాస్త యంగ్ ఏజ్‌లోనే ప్రారంభిస్తాం. అది వాళ్ల ఆహార్యం, హెల్త్ సమస్యల రీత్యా ఇంకాస్త మందు లేదా 40 నుంచి 50,60ల వయసులో మొదలు పెడతారు. అంతకుమించి మరీ లేటు వయసులో..అది కూడా విశ్రాంతి తీసుకునే వయసులో ఎవ్వరూ మొదలుపెట్టే సాహసం చేయరు. కానీ ఈ బామ్మ అలా కాదు. ఏడు పదలు వయసులో బరువు తగ్గాలనుకోవడమే కాదు, ఆ వయసులో కష్టతరమైన కసరత్తులు చేసి గుర్తుపట్టలేనంత నాజూకుగా మారిపోయింది. పైగా ఫిట్‌నెస్ టిప్స్ చెప్పేస్తోంది.
కెనడాలోని ఒంటారియాకు చెందిన 79 ఏళ్ల జోన్ మెక్‌డొనాల్డ్ అసాధారణమైన సాహాసానికి పూనుకుని బరువు తగ్గాలనే ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచారామె. వయసు కేవలం నెంబరేనని ప్రూవ్‌చేసింది. అంతేగాదు 70 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కౌట్లు చేసి ఔరా అనిపించుకుంది. దాదాపు ఎనిమిదేళ్లుగా అధిక బరువుతో ఉండేదాన్ని అని ఇన్‌స్టా వేదికగా తన వెయిట్ లాస్ స్టోరీ షేర్ చేసుకుందామె.
తాను ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా కేర్ తీసుకున్నట్లు తెలిపింది. బరువు తగ్గడం అనేది ఎప్పుడూ కష్టతరమైన ప్రక్రియ కాదు. కూరగాయలు, ఫైబర్‌పై ఫోకస్ పెడుతూ..కండరాలను బలోపేతం చేసేలా వ్యాయామాలు చేస్తే చాలంటోంది ఈ బామ్మ జోన్. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా ఎలాంటి వర్కౌట్లు చేస్తే బెటర్ అనేది తెలుసుకున్నానని వివరించింది. అందుకోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రారంభించినట్లు తెలిపింది.
వార్మప్ నుంచి మొదలుపెట్టి..వేగవంతంగా చేసే వ్యాయామాలు దాదాపు 60 నుంచి 70 నిమిషాలు కొనసాగేవని చెప్పుకొచ్చింది. అంతేగాదు ప్రతి నెల తనలో వస్తున్న పరివర్తనను గమనించానని, అదీగాక తాను మరింత బలంగా ఫిట్‌గా ఉన్నట్లు అనిపించిందని వెల్లడించింది.
ఇక వర్కౌట్ల పరంగా బామ్మ వారానికి రెండు లెగ్ సెషన్‌లు, రెండు అప్పర్ బాడీ, ఒక గ్లూట్-ఫోకస్డ్ సెషన్ తప్పనిసరిగా చేసేదాన్ని అని అంటోదంది ఈ బామ్మ. ఏ వయసులో వెయిట్‌లాస్ ప్రక్రియ ప్రారంభించినా..డెడికేషన్ మస్ట్ అప్పుడే సత్ఫలితాలు పొందగలరని చెప్పకనే చెప్పింది కదూ ఈ బామ్మ జోన్.
(చదవండి: పెళ్లి వేడుకలో కిరణ్ మజుందార్ షా, సుధామూర్తిల స్టెప్పులు..!)


