ఆనందానికి వయసుతో సంబంధమే లేదు. అందులోనూ సంతోషభరితమైన సమయాల్లో మనసులోని భావోద్వేగాన్ని చాలామంది డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. అందుకు చిన్న పెద్ద అతీతం కాదు. అలానే ఇక్కడ ఇద్దరు దిగ్గజ మహిళలు చిన్న పిల్లలా మారిపోయి ఎలా స్టెప్పులు వేశారో చూడండి. వారి నృత్యం చూస్తే..పదిల పరుచుకునే మధుర క్షణాలను మధురమైన జ్ఞాపకంగా ఎలా మలుచుకోవాలో చెబుతున్నట్లు ఉంది.
ఇన్ఫోసిస్ ఫౌండేసన్ చైర్‌పర్సన్,రాజ్యసభ సభ్యురాలు, సుధామూర్తి, పిల్లల రచయిత్రి, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాలు ఒక వివాహ వేడుకలో ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారంటే.. ఆ వేడుక ఒక్కసారిగా కన్నుల పండుగగా మారిపోయింది. డెబైల వయసులో చాలా ఉత్సాహభరితంగా నృత్యం చేసి అక్కడి వాతావరణాన్నే ఆహ్లాదభరితంగా మార్చేశారు ఈ శక్తిమంతమైన దిగ్గజాలు.
ధోల్ బీట్‌లకు అందంగా నృత్యం ఈ వివాహ వేడుకకు వచ్చిన అతిధులందరి మనసులను దోచుకున్నారు. కేవలం కెరీర్ పరంగానే గాదు ఎంజాయ్ చేయడంలోనూ మాకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా చిందులేశారు ఆ ఇద్దరూ. అందుకు సంబంధిచిన వీడియోని రాజకీయ నాయకుడు, వ్యవస్థాపకుడు అనిల్ శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది.
దశాబ్దాలుగా ఈ ఇద్దరు మహిళలు వృత్తిపరమైన విజయాల తోపాటు దాతృత్వం, తెలివితేటల పరంగా అందరికీ ప్రీతిపాత్రమైన వ్యక్తులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ అరుదైన ఘటనతో మరోసారి ఇద్దరి పేరు మారుమ్రోగిపోవడమే కాదు..ఆనందాన్ని గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేయడం ఎలానో చేసి చూపించారు.
ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదంటే..
కిరణ్ మజుందార్ షా మేనల్లుడు ఎరిక్ మజుందార్ వివాహ వేడుక ఇది. ఎరిక్ ఆష్లే పౌర్ణిమను వివాహ చేసుకున్నారు. ఈ జంట ఇటీవలే బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్‌లో వివాహ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా, ఎరిక్ యూఎస్‌లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్)లో కంప్యూటింగ్, మ్యాథమెటికల్ సైన్సెస్ అండ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తునన్నారు. అలాగే ఆయన బయోకాన్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా. ఇక వధువు ఆష్లే పౌర్ణమ్ వైద్యురాలిగా, కంప్యూటేషనల్ బయాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.
(చదవండి: ఐఏఎస్ అవ్వాలని ఎంతలా ప్రయత్నించాడంటే..! ఏకంగా 12 సార్లు..)


