ప్రముఖ సింగర్‌కు అరుదైన గౌరవం.. ఆయన పేరిట ఏకంగా కోర్సు! | Canadian university introduces course on Punjabi singer Diljit Dosanjh | Sakshi
Sakshi News home page

ప్రముఖ సింగర్‌కు అరుదైన గౌరవం.. యూనివర్సిటీలో ఏకంగా కోర్సు!

Jun 23 2025 8:08 PM | Updated on Jun 23 2025 9:02 PM

Canadian university introduces course on Punjabi singer Diljit Dosanjh

ప్రముఖ సింగర్‌ దిల్జీత్‌ దోసాంజ్‌కు అరుదైన ఘనత దక్కింది. ఆయన పేరుపై ఏకంగా కోర్సు ప్రారంభించనున్నట్లు కెనడాకు చెందిన యూనవర్సిటీ ప్రకటించింది. ఈ పంజాబ్‌ గాయకుడిపై ఏకంగా కోర్సును అందిస్తున్నట్లు వెల్లడించింది. బోర్న్ టు షైన్ పేరుతో టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన  ది క్రియేటివ్ స్కూల్‌లో వచ్చే ఏడాది నుంచి అతని పేరిట కోర్సు ప్రారంభించాలని నిర్ణయించింది. తాజాగా జరిగిన సమ్మిట్‌లో ఈ విషయాన్ని ‍ప్రకటించారు.

కాగా.. పంజాబ్‌కు చెందిన దిల్జీత్ దోసాంజ్ ప్రపంచ వేదికపై సత్తా చాటారు. గత ఇరవై ఏళ్లుగా అంతర్జాతీయ వేదికలపై తన గాత్రంతో అభిమానులను అలరించారు. 'మూన్‌చైల్డ్ ఎరా', 'గోట్' లాంటి మ్యూజిక్ ఆల్బమ్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. 'మూన్‌చైల్డ్ ఎరా' కెనడియన్ ఆల్బమ్‌ల జాబితాలో ఏకంగా 32వ స్థానానికి చేరుకుంది. ఒక భారతీయ కళాకారుడిగా అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఆయనపై కోర్సు అందించడం అతని ప్రతిభకు నిదర్శనమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


దిల్జీత్ దోసాంజ్ తన నటనా జీవితంలో అద్భుతంగా రాణించారు. 'జాట్ అండ్ జూలియట్', 'పంజాబ్ 1984', 'సజ్జన్ సింగ్ రంగ్‌రూట్' వంటి అనేక పంజాబీ సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. అలాగే 'ఉడ్తా పంజాబ్' లాంటి బాలీవుడ్ మూవీలోనూ కనిపించారు. గతేడాది  'చమ్‌కిలా' అనే చిత్రంలో నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా 2023లో అతను తన 'దిల్-లుమినాటి' పర్యటనతో ఉత్తర అమెరికాలో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కెనడాలో జరిగిన అతిపెద్ద పంజాబీ కచేరీలతో పేరు సంపాదించారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement