
ఇటీవలి కాలంలో భారతీయ సంప్రదాయాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హైందవ పురాణాలకు, దేవుళ్లు దేవతలకు గతంలో ఎన్నడూ లేనంత గుర్తింపు లభిస్తోంది. దీంతో విదేశాలలో పలు చోట్ల హిందూ దేవుళ్ల ఆలయాలు, విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి. అదే క్రమంలో కెనడాలోని మిస్సిసాగాలో 51 అడుగుల ఎత్తైన రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఇది ఉత్తర అమెరికా ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా నిలిచింది. ఢిల్లీ, గుర్‌గావ్‌కు చెందిన ప్రఖ్యాత కళాకారుడు నరేష్ కుమార్ కుమావత్ మనేసర్‌లోని మాటు రామ్ ఆర్ట్ సెంటర్‌లో చెక్కిన ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా కెనడాకు తరలించారు. తరువాత దీనిని అమెరికా నుంచి వచ్చిన ఇంజనీర్ల బృందం ఒకటే మూర్తిగా మలచింది. ఈ నిర్మాణం విమానాల తయారీలో తరచుగా ఉపయోగించే ఫైబర్‌గ్లాస్ స్టీల్‌తో తయారు చేయడం విశేషం.
ఇటీవలే జరిగిన ఈ శ్రీరాముని విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమ్యూనిటీ సభ్యులు మాత్రమే కాకుండా దాని సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా భిన్న రంగాల ప్రముఖులు కూడా హాజరయ్యారు. రాజకీయ నాయకులలో, మహిళా లింగ సమానత్వ మంత్రి రీచర్ వాల్డెజ్, ట్రెజరీ బోర్డు అధ్యక్షుడు షఫ్కత్ అలీ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధూ కూడా హాజరయ్యారు. విగ్రహం ఏర్పాటు చేసిన హిందూ హెరిటేజ్ సెంటర్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ, శ్రీరాముని కొలువుదీర్చడం వల్ల ఉత్తర అమెరికా అంతటా సందర్శకులకు ఆసక్తి పెరుగుతుందని గుర్తించామన్నారు. న్యూయార్క్ న్యూజెర్సీ ల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారన్నారు.
చదవండి: ఇండోర్ మహారాణి : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ఆ డైమండ్స్ ఎలా మోసారండీ!
ప్రజలు ఆలయాన్ని సందర్శించడంతో పాటు కెనడాలోనే ఎత్తైన శ్రీరామ విగ్రహాన్ని కూడా సందర్శిస్తున్నారు‘ అని ఆయన అన్నారు. ఉత్తర అమెరికాలో అతిపెద్ద శ్రీరామ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ‘చాలా గర్వించదగ్గ విషయం‘ అని సిద్ధూ అన్నారు. ఈ మూర్తిని ఏర్పాటు చేయడం కేవలం గర్వకారణం కాదు. ఇది సమాజానికి ఒక ఆధ్యాత్మిక బహుమతి, ధర్మం ఎల్లప్పుడూ మన మార్గాన్ని నడిపించాలని గుర్తు చేస్తుంది‘ అని కేంద్రం వ్యవస్థాపకుడు ప్రధాన పూజారి ఆచార్య సురీందర్ శర్మ శాస్త్రి అన్నారు.
చదవండి: డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్‌కపుల్
ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడు కుషాగర్ శర్మ మాట్లాడుతూ, ‘10,000 మందికి పైగా ప్రజలు భక్తి ఐక్యత కలిసి శ్రీరాముని 51 అడుగుల ఎతై ్తన మూర్తిని ఆవిష్కరించింది‘ అని అన్నారు. ‘ఇది కేవలం మన విశ్వాసానికి ఒక వేడుక మాత్రమే కాదు, సాంస్కృతిక సామరస్యం ఆధ్యాత్మిక వారసత్వానికి విలువనిచ్చే కెనడియన్లందరికీ గర్వకారణమైన క్షణం‘ అని అన్నారు. మిస్సిసాగాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే విమానాలు దిగేటప్పుడు ఆలయం మీదుగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయని చెప్పారు. అలాగే ఈ అత్యంత ఎత్తైన రాముడి విగ్రహం త్వరలో ప్రయాణీకులను స్వాగతించే మొదటి ప్రదేశాలలో ఒకటిగా మారనుందని ఆయన పేర్కొన్నారు.