
కెనడాలో నివసిస్తున్న.. భారతీయ మహిళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రెండు దేశాల మధ్య కిరాణా ధరలలో వ్యత్యాసం ఎలా ఉన్నాయో చూసి.. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోతున్నారు.
''బ్రెడ్, పాలు మాత్రమే కొన్న తర్వాత ఎప్పుడైనా విసుగు చెందినట్లు అనిపించిందా?.. కెనడాకు స్వాగతం. భారతదేశంలో కిరాణా ధరలు వర్సెస్ కెనడా ధరలు. షాక్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి'' అంటూ.. ఇన్‌స్టా యూజర్ వీడియో షేర్ చేశారు.
వీడియోలో గమనిస్తే.. ఒక క్యాలీఫ్లవర్ ధర రూ. 237.25, అల్లం రూ. 177.30, క్యారెట్ రూ. 66.88, ఒక మామిడి రూ. 106, ఒక యాపిల్ రూ. 78.87, ఒక బంగాళాదుంప రూ. 78.24, నాలుగు లీటర్ల పాలు రూ. 396.25, బ్రెడ్ రూ. 230 ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే కెనడాలో నిత్యావసరాల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ధరలు చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు సంపాదించేది డాలర్లలో ఉన్నప్పుడు, ధరలను మాత్రం రూపాయల్లో ఎందుకు పోల్చుతున్నారు అని అన్నారు.