
హైదరాబాద్‌కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కెనడా, అమెరికా ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. ఈ మేరకు కెనడా సంస్థ చార్జ్ పవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్యూర్ కంపెనీ తెలిపింది.
ఈ భాగస్వామ్యంతో ప్యూర్ అధునాతన ఎనర్జీ స్టోరేజ్ ప్రొడక్ట్ లైన్ ను కో-బ్రాండింగ్ అరేంజ్‌మెంట్ ద్వారా కెనడా, అమెరికాలోని వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ఉత్పత్తులు రెసిడెన్షియల్, కమర్షియల్ నుంచి గ్రిడ్ స్కేల్ అప్లికేషన్స్ వరకు ఉంటాయని పేర్కొంది.
తమకున్న పటిష్టమైన తయారీ సౌకర్యాలతో బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్‌లో లోతైన నైపుణ్యాన్ని సాధించామని, తమ మా సృజనాత్మక, మన్నికైన, నమ్మదగిన ఇంధన నిల్వ ఉత్పత్తులకు యూఎస్, కెనడా మార్కెట్లలో విస్తృత ఆమోదం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు ప్యూర్ ఫౌండర్, ఎండీ నిశాంత్ దొంగరి అన్నారు.