కెనడాలో భారతీయ విద్యార్థిని మృతి.. ఏం జరిగింది? | University Of Calgary Indian Student Tanya Tyagi Dies In Canada, More Details Inside | Sakshi
Sakshi News home page

కెనడాలో భారతీయ విద్యార్థిని మృతి.. ఏం జరిగింది?

Jun 20 2025 9:39 AM | Updated on Jun 20 2025 10:55 AM

Indian student Tanya Tyagi dies in Canada

ఢిల్లీ: కెనడాలో భారతీయ విద్యార్థిని మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీకి చెందిన తన్యా త్యాగి కెనడాలో మృతి చెందింది. అయితే, ఆమె మృతి గల కారణాలు తెలియరాలేదు. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.

వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన తన్యా త్యాగి కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటుంది. ఆమె గురువారం మరణించింది. ఈ విషయాన్ని వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌ ధ్రువీకరించింది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదని కాన్సులేట్‌ తెలిపింది. బాధిత కుటుంబానికి కాన్సులెట్‌ సంతాపం తెలిపింది. వారికి అన్నివిధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించింది. త్యాగి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement