స్పా కేంద్రంగా నేరాల ముఠా.. మహిళలే టార్గెట్‌! | Kochi Sharanya Gang Rape Case | Sakshi
Sakshi News home page

స్పా కేంద్రంగా నేరాల ముఠా.. మహిళలే టార్గెట్‌!

Oct 16 2026 2:29 PM | Updated on Oct 16 2026 2:32 PM

Kochi Sharanya Gang Rape Case

కొచ్చి కలమస్సేరి స్పా కేంద్రంగా వెలుగుచూసిన సామూహిక అత్యాచారం కేసులో అలప్పుళకు చెందిన శరణ్య కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రధాన నిందితుడు శ్రీరాజ్‌ ముఠాలోకి మహిళలను తీసుకురావడంలో ఆమె సహకరించినట్లు అనుమానిస్తున్నారు. బాధితురాలు కూడా శరణ్య తనను ఎక్కువగా వేధించిందని పోలీసులకు తెలిపింది. మాదకద్రవ్యాలు తీసుకున్న తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పులు వస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు.

అయితే, శ్రీరాజ్‌ స్పాలకు మహిళలను పంపించడంతోపాటు, అక్కడి సమస్యలను పరిష్కరించి యజమానుల నుంచి డబ్బులు వసూలు చేసేవాడని ఆరోపణలున్నాయి. శరణ్య మహిళలను గుర్తించి, వారితో సంప్రదింపులు జరిపి ముఠాలోకి తీసుకొచ్చేదని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మొదట్లో అదే స్పాలో పనిచేయడానికి వచ్చిన ఆమె.. శ్రీరాజ్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత నేరాల్లో భాగస్వామిగా మారినట్లు దర్యాప్తులో గుర్తించారు.

ఈ కేసులో శరణ్య రెండో నిందితురాలు కాగా, బాధితురాలు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పుడు మరో నిందితుడు సంజయ్‌ అడ్డుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో పోలీసులు నిందితులను ఘటన జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లాడ్జికి తీసుకెళ్లి ఆధారాలు సేకరించారు. గతంలోనూ అక్కడ ఇలాంటి ఘటనలు జరిగినట్లు ఫిర్యాదులు అందగా, బాధితురాలిని ఇంటర్వ్యూ పేరుతో ఆహ్వానించిన ‘డిలైట్‌ స్పా’లోనూ ఆధారాలు సేకరించారు.

అలాగే, బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి రాత్రంతా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే, లాడ్జిలోని సీసీటీవీ ఫుటేజీని తొలగించడంతో దాన్ని తిరిగి పొందేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గదిలోకి మరో ఇద్దరు వచ్చినట్లు బాధితురాలు చెప్పింది. అయితే, ఆమె అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాతే వారు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement