తూటాకు బలైన భారతీయ విద్యార్థిని | Indian Student Harsimrat Randhawa Case In Canada Details | Sakshi
Sakshi News home page

కెనడా: పాపం హర్‌సిమ్రత్.. బస్టాప్‌లో ఎదురు చూస్తుండగా దూసుకొచ్చిన తూటా

Apr 19 2025 9:57 AM | Updated on Apr 19 2025 2:20 PM

Indian Student Harsimrat Randhawa Case In Canada Details

కెనడాలో ఓ భారతీయ విద్యార్థి(Indian Student)ని అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న టైంలో ఎక్కడి నుంచో ఆమెపైకి ఓ తూటా దూసుకొచ్చి ఛాతిలో దిగింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన భారతీయ కాన్సులేట్‌ జనరల్‌.. ఎక్స్‌ ద్వారా వివరాలు తెలియజేసింది.

హోమిల్టన్‌లోని మోహాక్‌ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్ రంధవా(21).. బుధవారం సాయంత్రం 7.30గం. ప్రాంతంలో బస్టాప్‌లో వేచి ఉంది. ఆ సమయంలో అక్కడికి కాస్త దూరంలో రెండు కార్లు ఆగి ఉన్నాయి. ఉన్నట్లుండి వాటిల్లో ఉన్న వ్యక్తులు తుపాకులతో పరస్పరం కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ తుటా హర్‌సిమ్రత్ రంధవా(Harsimrat Randhawa) శరీరంలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే.. 

ఛాతీలో బుల్లెట్‌ దిగడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగిందని, ఆస్పత్రికి తరలించేలోపే ఆమె కన్నుమూసిందని వైద్యులు వెల్లడించారు. కాల్పుల సమయంలో పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని, అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం జరగలేదని హామిల్టన్‌ పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వివరాలు సేకరించిన అధికారులు.. దర్యాప్తునకు సహకరించాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement