కెనడాలో జీ7 శిఖరాగ్రానికి మోదీ డుమ్మా!? | PM Narendra Modi unlikely to attend G7 Summit in Canada | Sakshi
Sakshi News home page

కెనడాలో జీ7 శిఖరాగ్రానికి మోదీ డుమ్మా!?

Jun 3 2025 4:30 AM | Updated on Jun 3 2025 4:30 AM

PM Narendra Modi unlikely to attend G7 Summit in Canada

న్యూఢిల్లీ: కెనడాలో ఈ నెల 15 నుంచి మొదలయ్యే జీ7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఆరేళ్లుగా జీ7 సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న ప్రధాని మోదీ మొదటిసారిగా డుమ్మా కొట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్‌ 15–17 తేదీల మధ్య అల్బర్టాలో ఈ భేటీ జరగనుంది. 

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి కీలకమైన అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లపై కూటమిలోని ప్రముఖ పారిశ్రామిక దేశాల నేతలు చర్చించనున్నారు. శిఖరాగ్రానికి రావాలంటూ ప్రధాని మోదీకి కెనడా ఇప్పటి వరకు ఆహ్వాన సైతం పంపలేదు. ఇప్పటికిప్పుడు ఆహ్వానం వచ్చినా ఇరుదేశాల మధ్య నెలకొన్న సంబంధాలు, వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సన్నద్ధతకు సమయం పడుతుందని చెబుతున్నారు. జీ7 కూటమిలో అమెరికా, యూకే, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌ సభ్యదేశాలు కాగా, ప్రస్తుతం కెనడా అధ్యక్షత బాధ్యతల్లో ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement