breaking news
G7
-
జీ 7 ప్రముఖులకు పీఎం మోదీ అపురూపమైన బహుమతులు
భువనేశ్వర్: కెనడాలో జరిగిన జీ–7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు హాజరైన ప్రముఖులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అద్భుతమైన రాష్ట్ర కళాకృతుల్ని బహుమానంగా అందజేశారు.జీ–7 సదస్సులో పాల్గొన్న కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్‌కు ప్రధాన మంత్రి వెండి తీగల అల్లిక క్లచ్ పర్స్‌ను బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రంలో కటక్ అందమైన వెండి తీగల సంప్రదాయ అల్లిక చేతి పనులకు (తారొకొసి) ప్రసిద్ధి. ఈ అపురూప కళ 500 సంవత్సరాలు పైబడిన ప్రాచీనమైనది. ఆనాటి మొఘల్ చక్రవర్తుల ఆదరణతో వెలుగొందిన కళ నేటికి నిలకడగా తళుక్కుమంటోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్‌కు ప్రపంచ ప్రఖ్యాత 13వ శతాబ్దపు కోణార్క్ సూర్య దేవాలయం కాల చక్రం కానుకగా సమరి్పంచారు. ఇసుక రాయితో రూపుదిద్దుకోన్న కోణార్కు చక్రం ప్రతిరూపం రాష్ట్ర శిల్ప కళా నైపుణ్యాన్ని జీ 7 దేశాల్లో ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేశారు. సూర్య రశ్మి ఆధారంగా సమయం సూచించే రీతిలో ఈ చక్రంలో ఊచల్ని శిల్పులు చెక్కు చెదరకుండా పొందుపరచడం విశేషం. ఇది అంతులేని కాల చక్రాన్ని చూపుతుంది. పూరీ జిల్లా కళా గ్రామం రఘురాజపూర్ ప్రాంతపు పొట్టా చిత్రాన్ని క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిచ్‌కు ప్రధాన మంత్రి బహుమతిగా సమర్పించారు. పొట్టా చిత్రం రాష్ట్రానికి చెందిన అందమైన సంప్రదాయ కళారూపం. ఇది వస్త్రంపై వివరణాత్మక, రంగురంగుల చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ చిత్రాలు పొట్టా (వస్త్రం), చిత్ర (చిత్రం)గా పేరొందాయి. సాధారణంగా భారతీయ పౌరాణిక గాథల శీర్షికల ఇతివృత్తంగా అర చేతిలో ఇమిడే అతి చిన్న చిత్రాలు మొదలుకొని సువిశాల పటాలు రూపొందించడంరఘురాజపూర్ కళాకారుల ప్రత్యేకతని జీ 7 ప్రతినిధులకు ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేయించడం విశేషం. -
తక్షణమే ఖాళీ చేయండి
కనానాస్కిస్/వాషింగ్టన్: జీ7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన కీలక భేటీలను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఉధృతంగా మారుతుండడంతో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికే ఆయన కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని అమెరికాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను తక్షణమే ఖాళీ చేయాలని ట్రంప్ సూచించారు.ఇజ్రాయెల్ దాడులు భీకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. ఆయన స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం కెనడాలో మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. సాయంత్రం జీ7 దేశాల అధినేతలతో ఫొటోలు దిగారు. ‘‘నేను వెంటనే వెనక్కి వెళ్లిపోవాలి. చాలా ముఖ్యం’’ అని చెప్పారు. ఇంకా ఆలస్యం కాకముందే ఆణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్‌కు ట్రంప్ హితవు పలికారు.దాడులు ఆగాలంటే ఆణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించినా ఇరాన్ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని తప్పుపట్టారు. మరో గత్యంతరం లేక ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై దాడులకు దిగిందని అభిప్రాయపడ్డారు. యుద్ధం ఆగాలా? లేక కొనసాగాలా? అనేది ఇరాన్ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో అమెరికా పాత్ర ఏమిటి? అని ప్రశ్నించగా.. స్పందించడానికి నిరాకరించారు. ఇరాన్‌కు అణుబాంబు దక్కదు అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలోకి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ ఇరాన్ అణు బాంబును తయారు చేసుకొనే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశారు. కెనడా నుంచి స్వదేశానికి వస్తూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయడం లేదంటూ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఈ ఏడాది మార్చి నెలలో చేసిన ప్రకటనను ట్రంప్ కొట్టిపారేశారు. ఆమె ఏం చెప్పారో తాను పట్టించుకోనన్నారు. ఇజ్రాయెల్ సైన్యానిదీ అదేమాట టెల్ అవీవ్/టెహ్రాన్: ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసంచేయాలని, అణు శాస్త్రవేత్తలను, కీలక సైనికాధికారులను అంతమొందించాలని ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మధ్యభాగంలో క్షిపణి దాడులకు సిద్ధమవుతోంది. సెంట్రల్ టెహ్రాన్‌లో ఉంటున్న 3.30 లక్షల మంది బయటకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది.టెహ్రాన్‌ను పూర్తిగా ఖాళీ చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పిన కాసేపటికే సైన్యం అదే తరహాలో ఆదేశాలివ్వడం గమనార్హం. ఇరాన్ ప్రభుత్వ టీవీ, పోలీసు ప్రధాన కార్యాలయాలతోపాటు ముఖ్యమైన ఆసుపత్రులు సెంట్రల్ టెహ్రాన్‌లోనే ఉన్నాయి. రాజధాని నగరంలో 90 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఇక్కడ వైమానిక దాడులు జరిగితే ప్రాణనష్టం ఊహించని స్థాయిలో సంభవించే అవకాశం ఉంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
కెనడాలో జీ7 శిఖరాగ్రానికి మోదీ డుమ్మా!?
న్యూఢిల్లీ: కెనడాలో ఈ నెల 15 నుంచి మొదలయ్యే జీ7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఆరేళ్లుగా జీ7 సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న ప్రధాని మోదీ మొదటిసారిగా డుమ్మా కొట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్ 15–17 తేదీల మధ్య అల్బర్టాలో ఈ భేటీ జరగనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి కీలకమైన అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లపై కూటమిలోని ప్రముఖ పారిశ్రామిక దేశాల నేతలు చర్చించనున్నారు. శిఖరాగ్రానికి రావాలంటూ ప్రధాని మోదీకి కెనడా ఇప్పటి వరకు ఆహ్వాన సైతం పంపలేదు. ఇప్పటికిప్పుడు ఆహ్వానం వచ్చినా ఇరుదేశాల మధ్య నెలకొన్న సంబంధాలు, వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సన్నద్ధతకు సమయం పడుతుందని చెబుతున్నారు. జీ7 కూటమిలో అమెరికా, యూకే, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ సభ్యదేశాలు కాగా, ప్రస్తుతం కెనడా అధ్యక్షత బాధ్యతల్లో ఉంది. -
రష్యా రెక్కలు విరుస్తాం: బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నియంతగా, యుద్ధ పిపాసిగా అభివర్ణించారు. అకారణ యుద్ధానికి దిగినందుకు ఆయన దోషిగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయమన్నారు. జీ7 దేశాల నేతలతో గంటకు పైగా వర్చువల్‌గా చర్చించాక భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక బైడెన్ మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా, ఇతరత్రా కూడా రష్యా రెక్కలు విరిచేస్తామన్నారు. ‘‘మరో నాలుగు అతి పెద్ద రష్యా బ్యాంకులపై, పుతిన్‌కు సన్నిహితులైన ఆ దేశ కుబేరులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాం. ఆ బ్యాంకులకు, సంపన్నులకు చెందిన అన్ని ఆస్తులనూ జప్తు చేస్తున్నాం. ఇక అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలతో రష్యాకు సంబంధాలన్నీ తెగిపోయినట్టే. చదవండి: (Vladimir Putin: రష్యా అధ్యక్షుడికి ఎక్కడిదీ బరి తెగింపు!) డాలర్లు, యూరోలు, పౌండ్లు, యెన్ కరెన్సీల్లో ఇకపై రష్యా ఎలాంటి లావాదేవీలు చేయలేదు. ఆ దేశ ఎగుమతులు, దిగుమతుల సామర్థ్యం తీవ్రంగా దెబ్బ తీస్తాం. ఇవన్నీ యూరోపియన్ యూనియన్, జపాన్ తదితర దేశాలతో కలిసి అమెరికా సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలు. త్వరలో రష్యాపై మరిన్ని అతి కఠిన ఆంక్షలుంటాయి’’ అని ప్రకటించారు. తూర్పు యూరప్‌లోని నాటో స్థావరాలకు మరిన్ని అమెరికా బలగాలను తరలిస్తున్నట్టు చెప్పారు. నాటో దేశాలకు చెందిన ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటామన్నారు. ఉక్రెయిన్ క్షేమం కోసం ప్రపంచ దేశాలన్నింటితో కలిసి ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆ దేశానికి నైతికంగా, మానవతా దృక్పథంతో అన్ని రకాల సాయమూ చేస్తామన్నారు. చదవండి: (Russia Ukraine War Effect: ప్రపంచం చెరి సగం.. భారత్ ఎందుకు తటస్థం?) -
కోవిడ్ నుంచి వాతావరణ మార్పుల దాకా..
లండన్/ వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో సంపన్న దేశాల కూటమి జీ–7 సదస్సు యూకేలోని కార్నవాల్‌లోని కార్బిస్ బే హోటల్లో ఈనెల 11 నుంచి 13 తేదీ వరకు జరగనుంది. సముద్రం ఒడ్డున ఉన్న ఒక గ్రామంలో, ప్రశాంతంగా ఉండే రిసార్ట్‌లో ఆతిథ్య దేశం యూకే ఈ సదస్సుని ఏర్పాటు చేసింది. అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సభ్య దేశాలుగా ఉన్న జీ–7 సదస్సు ఈసారి కోవిడ్‌పై యుద్ధం, వాతావరణంలో మార్పులపైనే ప్రధానంగా చర్చించనుంది. ఈ సదస్సులో పాల్గొనడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఇదే మొదటి విదేశీ పర్యటన. ఇక జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ కూడా పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విదేశీ పర్యటనకు వచ్చారు. ఈ ఏడాది జీ–7 సదస్సుకి అతిథి దేశాలుగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలను ఆహ్వానించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ హాజరు కరోనా విజృంభణ కారణంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సదస్సుకి ప్రత్యక్షంగా హాజరుకాలేకపోతున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ హాజరుకానున్నట్టుగా విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ తన యూకే ప్రయాణాన్ని గత నెలలోనే రద్దు చేసుకున్నారు. 92 దేశాలకు 50 కోట్ల ఫైజర్ వ్యాక్సిన్లు నిరుపేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ అందించడానికి అమెరికాలో బైడెన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 50 కోట్ల ఫైజర్ కంపెనీ టీకా డోసుల్ని కొనుగోలు చేసి 92 దేశాలకు పంపిణీ చేయనున్నట్టు వైట్‌హౌస్ వెల్లడించింది. దీనిపై అధ్యక్షుడు జో బైడెన్ జీ–7 సదస్సులో ఒక ప్రకటన చేయనున్నారు. ప్రపంచ ప్రజల ఆరోగ్యంపై అమెరికాకున్న చిత్తశుద్ధి ఎలాంటిదో ఈ ప్రకటనతో తేటతెల్లమవుతుందని, మరే ఇతర దేశమూ ఇంత భారీ స్థాయిలో సాయాన్ని అందించలేదని వైట్‌హౌస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యాక్సిన్ల షిప్పింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి 20 కోట్ల టీకా డోసుల్ని పంపిణీ చేస్తారు, మిగిలిన 30 కోట్ల డోసుల్ని వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో పంపిణీ చేసేలా అమెరికా చర్యలు తీసుకుంది. అందరికీ టీకా సంపన్న దేశాల బాధ్యత కరోనా నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటే వచ్చే ఏడాది చివరి నాటికల్లా ప్రపంచ జనాభాకు టీకా ఇవ్వడం పూర్తి కావాలని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఈ దిశగా జీ–7 దేశాలు చర్యలు తీసుకోవాలని, ప్రపంచ జనాభా వ్యాక్సినేషన్ బాధ్యత సంపన్న దేశాలే తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సదస్సుకి ఒక్క రోజు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే ఎజెండా ► కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న సమయంలో బిల్ట్ బ్యాక్ బెటర్ అన్న నినాదంతో సదస్సు జరగనుంది. ► కోవిడ్‌పై పోరాటంతో పాటు భవిష్యత్‌లో వచ్చే మహమ్మారుల్ని ఎదుర్కొనేలా ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం. ► స్వేచ్ఛా వాణిజ్య విధానానికి ప్రోత్సాహం. ► వాతావరణంలో మార్పుల్ని తట్టుకుంటూ జీవవైవిధ్యాన్ని కాపాడే చర్యలు. -
ఉత్తర కొరియాకు ‘జీ–7’ వార్నింగ్
తోర్మినా: ఉత్తరకొరియా తాజాగా చేపట్టిన క్షిపణి పరీక్షలపై జీ–7 దేశాధినేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాలు ప్రపంచ భద్రతకు ప్రమాదంగా మారాయని.. ఉత్తరకొరియాపై తీవ్రమైన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఇటలీలోని తోర్‌మినాలో జరుగుతున్న జీ–7 దేశాల సదస్సు ముగింపు సందర్భంగా ‘భద్రతామండలి తీర్మానాలకు అనుగుణంగా అన్ని అణు, బాలిస్టిక్ క్షిపణులను వదులుకోవాలి. ఉత్తరకొరియాలో మానవహక్కులను పరిష్కరించాలి’ అని ఓ ప్రకటనలో ఆదేశించారు. కాగా, పారిస్ పర్యావరణ ఒప్పందంపై ఏకాభిప్రాయ సాధన విషయంలో ట్రంప్ వ్యవహారంపై జీ–7 దేశాధినేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.