జీ 7 ప్రముఖులకు పీఎం మోదీ అపురూపమైన బహుమతులు | PMs gifts to G7 leaders echo incredible India Brass tree silver pot, paintings | Sakshi
Sakshi News home page

జీ 7 ప్రముఖులకు పీఎం మోదీ అపురూపమైన బహుమతులు

Jun 20 2025 5:16 PM | Updated on Jun 20 2025 6:08 PM

 PMs gifts to G7 leaders echo incredible India Brass tree silver pot, paintings

భువనేశ్వర్‌: కెనడాలో జరిగిన జీ–7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు హాజరైన ప్రముఖులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అద్భుతమైన రాష్ట్ర కళాకృతుల్ని బహుమానంగా అందజేశారు.

జీ–7 సదస్సులో పాల్గొన్న కెనడా గవర్నర్‌ జనరల్‌ మేరీ సైమన్‌కు ప్రధాన మంత్రి వెండి తీగల అల్లిక క్లచ్‌ పర్స్‌ను బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రంలో కటక్‌ అందమైన వెండి తీగల సంప్రదాయ అల్లిక చేతి పనులకు (తారొకొసి) ప్రసిద్ధి. ఈ అపురూప కళ  500 సంవత్సరాలు పైబడిన ప్రాచీనమైనది. ఆనాటి మొఘల్‌ చక్రవర్తుల ఆదరణతో వెలుగొందిన కళ నేటికి నిలకడగా తళుక్కుమంటోంది.   

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చాన్స్‌లర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌కు ప్రపంచ ప్రఖ్యాత 13వ శతాబ్దపు కోణార్క్‌ సూర్య దేవాలయం కాల చక్రం కానుకగా సమరి్పంచారు. ఇసుక రాయితో రూపుదిద్దుకోన్న కోణార్కు చక్రం ప్రతిరూపం రాష్ట్ర శిల్ప కళా నైపుణ్యాన్ని జీ 7 దేశాల్లో ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేశారు. సూర్య రశ్మి ఆధారంగా సమయం సూచించే రీతిలో ఈ చక్రంలో ఊచల్ని శిల్పులు చెక్కు చెదరకుండా పొందుపరచడం విశేషం. ఇది అంతులేని కాల చక్రాన్ని చూపుతుంది.  

పూరీ జిల్లా కళా గ్రామం రఘురాజపూర్‌ ప్రాంతపు పొట్టా చిత్రాన్ని క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్‌ మిలనోవిచ్‌కు ప్రధాన మంత్రి బహుమతిగా సమర్పించారు. పొట్టా చిత్రం రాష్ట్రానికి చెందిన అందమైన సంప్రదాయ కళారూపం. ఇది వస్త్రంపై వివరణాత్మక, రంగురంగుల చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ చిత్రాలు పొట్టా (వస్త్రం), చిత్ర (చిత్రం)గా పేరొందాయి. సాధారణంగా భారతీయ పౌరాణిక గాథల శీర్షికల ఇతివృత్తంగా అర చేతిలో ఇమిడే అతి చిన్న చిత్రాలు మొదలుకొని సువిశాల పటాలు రూపొందించడంరఘురాజపూర్‌ కళాకారుల ప్రత్యేకతని జీ 7 ప్రతినిధులకు ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేయించడం విశేషం. 

Advertisement
 
Advertisement
Advertisement