ఉత్తర కొరియాకు ‘జీ–7’ వార్నింగ్‌ | G7 warns on North Korea | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియాకు ‘జీ–7’ వార్నింగ్‌

May 28 2017 8:16 AM | Updated on Sep 5 2017 12:13 PM

ఉత్తర కొరియాకు ‘జీ–7’  వార్నింగ్‌

ఉత్తర కొరియాకు ‘జీ–7’ వార్నింగ్‌

ఉత్తరకొరియా తాజాగా చేపట్టిన క్షిపణి పరీక్షలపై జీ–7 దేశాధినేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తోర్‌మినా: ఉత్తరకొరియా తాజాగా చేపట్టిన క్షిపణి పరీక్షలపై జీ–7 దేశాధినేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాలు ప్రపంచ భద్రతకు ప్రమాదంగా మారాయని.. ఉత్తరకొరియాపై తీవ్రమైన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

ఇటలీలోని తోర్‌మినాలో జరుగుతున్న జీ–7 దేశాల సదస్సు ముగింపు సందర్భంగా ‘భద్రతామండలి తీర్మానాలకు అనుగుణంగా అన్ని అణు, బాలిస్టిక్‌ క్షిపణులను వదులుకోవాలి. ఉత్తరకొరియాలో మానవహక్కులను పరిష్కరించాలి’ అని ఓ ప్రకటనలో ఆదేశించారు. కాగా, పారిస్‌ పర్యావరణ ఒప్పందంపై ఏకాభిప్రాయ సాధన విషయంలో ట్రంప్‌ వ్యవహారంపై జీ–7 దేశాధినేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement