
టైటిల్: మటన్ సూప్
నిర్మాణ సంస్థలు - అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్
నటీనటులు - రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని తదితరులు
రచన, దర్శకత్వం - రామచంద్ర వట్టికూటి
నిర్మాతలు - మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల
సినిమాటోగ్రఫీ : భరద్వాజ్, ఫణింద్ర
మ్యూజిక్ : వెంకీ వీణ
ఎడిటింగ్ : లోకేష్ కడలి
విడుదల తేదీ: 10-10-2025
నిజ సంఘటనల ఆధారంగా తీసిన లేటేస్ట్ మూవీ మటన్ సూప్. ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. డిఫరెంట్ టైటిల్‌తో డైరెక్టర్ రామచంద్ర వట్టికూటి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ చిత్రం ఆడియన్స్‌ను ఎంతమేర ఆకట్టుకుంటుందో రివ్యూలో చూద్దాం.
మటన్ సూప్ కథేంటంటే..
శ్రీరాం (రమణ్) ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటాడు. డబ్బులు ఇవ్వడం.. ఇవ్వకపోతే వారి నుంచి నిర్దాక్షిణ్యంగా వసూళ్లు చేయడం చేస్తుంటాడు. దీంతో అతనికి శత్రువులు ఎక్కువవుతారు. అతని పార్ట్‌నర్‌తో కలిసి చేసే వ్యాపారం వల్ల చాలా శ్రీరాంకు సమస్యలు వస్తుంటాయి. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన సత్యభామ (వర్ష విశ్వనాథ్)ను శ్రీరాం ప్రేమిస్తాడు. వీరిద్దరూ ప్రేమికుల రోజున పార్క్‌లో ఉండటం, గజగంగ్ దళ్ చూడటం.. అలా అక్కడే ఆ ఇద్దరికీ పెళ్లి చేయడం జరుగుతుంది.
అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో శ్రీరాంపై కొందరు దాడి చేస్తారు. మొహంపై యాసిడ్ పోయటంతో మొత్తం కాలిపోతుంది. దీంతో శ్రీరాం హాస్పిటల్ పాలవుతాడు. శ్రీరాంను సత్య ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటుంటుంది. శ్రీరాంకి దగ్గరి బంధువైన శివరాం(జెమినీ సురేష్) ఈ దాడి మీద విచారణ చేస్తుంటాడు. అసలు దాడి ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఇంతకీ శ్రీరాంపై దాడి చేసిందెవరు? కృష్ణకు శ్రీరాంకు ఉన్న సంబంధం ఏంటి? అసలు శ్రీరాం తల్లికి వచ్చే అనుమానం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ మధ్య సినిమాల్లో కంటే ఎక్కువగా క్రైమ్స్, రకరకాల పద్దతుల్లో నేరాలు జరుగుతున్నాయి. అలా అందరినీ షాకింగ్‌కు గురి చేసే ఓ కేసుని తీసుకుని దర్శకుడు ఈ మటన్ సూప్ చిత్రాన్ని తెరకెక్కించాడు. డైరెక్టర్ రామచంద్ర వట్టికూటి ఎంచుకున్నఈ క్రైమ్ కథను అనుకున్న విధంగానే తెరపై ఆవిష్కరించాడు. ఇలాంటి క్రైమ్ కథల్లో ఉండే ట్విస్ట్‌లు మామూలే. సినిమా క్లైమాక్స్ ఏంటో అందరికీ ముందే తెలుస్తుంది. అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ చెప్పడంంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాలను రాసుకున్న తీరు ఆట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్‌లో బిల్డ్ చేసిన స్టోరీ.. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ సినిమాలో ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే..
రమణ్ ఇందులో రెండు పాత్రల్లో మెప్పించాడు. గత సినిమాతో పోలిస్తే నటన పరంగా తను మెరుగైనట్లు కనిపించాడు. హీరోయిన్ వర్ష విశ్వనాథ్ తన పాత్రలో మెప్పించింది. జెమినీ సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా నటించాడు. యాక్టర్ గోవింద్, గోపాల్ మహర్షి, కిరణ్ మేడసాని వారి పాత్రల పరిధి మేరకు నటించారు. భరద్వాజ్, ఫణీంద్ కెమెరా వర్క్, వెంకీ వేణు సంగీతం ఫర్వాలేదనిపించాయి. ఎడిటర్ తన కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. ఓవరాల్‌గా మటన్ సూప్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఓ సెక్షన్‌ను ఆకట్టుకునేలా ఉంది.