‘మటన్ సూప్’ హిట్ అవ్వాలి : అనిల్ రావిపూడి
రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’.‘విట్నెస్ ది రియల్ క్రైమ్’ ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. దసరా సందర్భంగా బుధవారం (అక్టోబర్ 1) నాడు ‘మటన్ సూప్’ టీజర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.ఈ టీజర్‌ను లాంఛ్ చేసిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ టైటిల్ చాలా బాగుంది. టీజర్ బాగుంది. టీం కూడా చాలా కొత్తగా ఉంది. దర్శకుడు రామచంద్రకు, హీరో రమణ్‌కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 10న చిత్రం రాబోతోంది. అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలి’ అని అన్నారు.నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ .. ‘గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్‌ను లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. మంచి స్క్రీన్ ప్లేతో మా చిత్రం రాబోతోంది. అక్టోబర్ 10న మా సినిమా రాబోతోంది. అందరూ వీక్షించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ .. ‘క్రమశిక్షణకు, నిబద్దతకు మారు పేరు అయిన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్‌ను లాంఛ్ చేశారు. ఆయన మా టీజర్‌ను లాంఛ్ చేయడం మా అదృష్టం. మా నిర్మాతలు నాకు ఎంతో అండగా నిలిచారు. రమణ్ గారు ఎంతో గొప్పగా నటించారు. మా అందరినీ ముందుండి నడిపిస్తున్న పర్వతనేని రాంబాబు గారికి థాంక్స్. గొప్పగా నటించిన గోవింద్, జెమినీ సురేష్ గార్లకు థాంక్స్. నాకు అండగా నిలిచిన సునీత అక్కకి థాంక్స్. మా సినిమా అక్టోబర్ 10న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని, పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.