మా అమ్మ కల నిజమైంది: నిర్మాత మల్లికార్జున | Producer Mallikarjuna About Mutton Soup Movie | Sakshi
Sakshi News home page

మా అమ్మ కల నిజమైంది: నిర్మాత మల్లికార్జున

Oct 13 2025 4:08 AM | Updated on Oct 13 2025 4:08 AM

Producer Mallikarjuna About Mutton Soup Movie

రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన సినిమా ‘మటన్‌ సూప్‌’. రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో మల్లికార్జున ఎలికా (గోపాల్‌), అరుణ్‌ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. ఈ సందర్భంగా మల్లికార్జున ఎలికా మాట్లాడుతూ– ‘‘మటన్‌ సూప్‌’కి నేను ఓ కో డైరెక్టర్‌గా వచ్చాను. రామచంద్ర ప్యాషన్‌ చూసి, ఈ సినిమా నిర్మించాను.

ప్రేక్షకుల స్పందన చూస్తుంటే మేం పడ్డ కష్టాన్ని ఇట్టే మర్చిపోయాం. మా సినిమా స్క్రీన్‌ ప్లే చూసి ఆడియన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నా దర్శకత్వంలో ఓ హారర్‌ మూవీ చేస్తున్నాను. అలాగే రామచంద్రతో మరో సినిమా  ప్లాన్‌ చేస్తున్నాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నేను సినిమాలు చేయాలని, స్క్రీన్‌పై నా పేరు కనిపించాలని మా అమ్మగారు కలలు కన్నారు. ‘మటన్‌ సూప్‌’తో ఆ కల నిజమైంది. కానీ ఇప్పుడు ఇది చూడటానికి మా అమ్మగారు లేకపోవడం చాలా బాధగా ఉంది’’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement