'జిగ్రిస్‌' మూవీ.. నలుగురి స్నేహితుల కథ (రివ్యూ) | Jigris Movie review and rating | Sakshi
Sakshi News home page

'జిగ్రిస్‌' మూవీ.. నలుగురి స్నేహితుల కథ (రివ్యూ)

Nov 13 2025 1:34 PM | Updated on Nov 13 2025 2:49 PM

Jigris Movie review and rating

టాలీవుడ్ యువ న‌టులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ నటించిన చిత్రం జిగ్రీస్‌.. ఈ మూవీని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించ‌గా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. నవంబర్‌ 14న విడుదల కానుంది. అయితే, ఈ మూవీ ప్రీమియర్స్‌ ఇప్పటికే థియేటర్స్‌లో వేశారు. యువ నటీనటులతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటి..
జిగ్రీస్‌ అనే టైటిల్‌కు తగ్గట్లుగా కార్తిక్ (కృష్ణ బూరుగుల ) ప్రవీన్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు రాత్రి ఫుల్‌గా మద్యం సేవించి ఉండగా మారుతీ 800 కారులో గోవా వెళ్లాలని అనుకుంటారు. వారందరూ తాగిన మైకంలో ఉండగా దారి మద్యలోనే కారు ట్రబుల్‌ ఇస్తుంది. ఈ క్రమంలోనే కథలోకి మరో ఆసక్తికరమైన క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది. ఈ నలుగురు స్నేహితులు అంత చిన్న కారులో గోవా చేరుకున్నారా..? రాత్రికిరాత్రే ఈ చిన్న కారులోనే ఎందుకు వెళ్లాలి అనుకుంటారు..? గోవాలో వీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు.. అక్కడ వారు చేసిన అల్లరి ఏంటి? గోవా ప్రయాణం వారి జీవితాలలో తెచ్చిన అనూహ్య మార్పులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే జిగ్రీస్‌ మూవీ చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
జిగ్రీస్‌ టైటిల్‌కు తగ్గట్టే  ఈ స్టోరీ నలుగురి స్నేహితులది. పెద్దగా కథలో ట్విస్ట్‌లు అంటూ ఏమీ లేవు కానీ నవ్వులు పూయిస్తుంది. చాలా సీన్స్‌ కూడా ప్రేక్షకులను నవ్విస్తాయి.  ఇలాంటి కథలకు బలం కూడా ఇదే..  ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించాడు. ముఖ్యంగా లారీ సీన్‌తో పాటు ఓ ఊర్లో నాటుకోడి ఎపిసోడ్ నవ్వులు తెప్పిస్తాయి. ఆపై కాండోమ్ చుట్టూ క్రియేట్‌ చేసిన సీన్ హిలేరియస్‌గా అందరినీ నవ్విస్తుంది. మావోయిస్టుల బ్లాక్ ఎపిసోడ్‌ కూడా ఓ మాదిరిగానే మెప్పిస్తుంది. 

ఇలాంటి ఫ్రెండ్స్‌ మన చుట్టూ కూడా ఉన్నారనిపించేలా ప్రేక్షకులకు అనిపిస్తుంది. చాలా సీన్లు కూడా మన కథనే వెండితెరపై చూపిస్తున్నారని కలుగుతుంది. ‘జిగ్రీస్’ కథలో పెద్దగా ఊహించని మలుపులు లేకపోయినప్పటకీ ప్రేక్షకుడిని మాత్రం ఎంటర్‌టైన్‌ చేస్తుంది. క్లైమాక్స్‌ సీన్‌ మాత్రం అందరిని మెప్పిస్తుంది. చాలామంది  ఆ సీన్‌ చూస్తున్నంత సేపు భావోద్వేగానికి గురవుతారు.

ఎవరెలా చేశారంటే..
సినిమాలో ఎక్కువగా కనిపించింది యువ నటీనటులే.. కానీ, అందరూ తమ పాత్రల మేరకు మెప్పించారు. లీడ్ రోల్ చేసిన కృష్ణ బూరుగుల పర్ఫార్మెన్స్  అందరినీ మెప్పిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి తనదైన నటనతో మెప్పిస్తాడు.  రామ్ నితిన్ తన పాత్ర మేరకు పర్వాలేదనిపిస్తాడు. ధీరజ్ ఆత్రేయచాలా సహజంగా, అమాయమైన నటనతో కామెడీ పండించాడు.  

మనీ వాక సినిమాలో కీలకమైన పాత్ర, అసలు కథ మెుత్తం తన చుట్టూనే తిరుగుతుంది. అయితే ఎమోషన్ సీన్స్ నటనలో అనుభవం ఇంకొంత అవసరం కావాలినిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. కమ్రాన్ అందించిన సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా బాగానే ఉంది. కథమేరకు నిర్మాణ విలువలు మెప్పించాయి. స్వప్నిక్ రావు సౌండ్ డిజైన్‌తో పాటు శ్యామల్ సిక్దర్ మిక్సింగ్ బాగుంది. మీ జిగ్రీస్‌తో కలిసి సినిమాకు వెళ్లండి తప్పకుండా నవ్వుకుంటూ ఎంజాయ్‌ చేస్తారు.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement